Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/astrazencac6862814-bf3d-4531-aa1e-fb471cac59c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/astrazencac6862814-bf3d-4531-aa1e-fb471cac59c5-415x250-IndiaHerald.jpgఇంతకుముందు వజ్రాలు, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను మాత్రమే చాలా భద్రంగా దాచుకునే వారు. ఎక్కడ తమ విలువైన వస్తువులను దొంగలు దోచుకుపోతారోనని అనుక్షణం భయపడేవారు. సామాన్య మానవులే కాదు.. ప్రభుత్వాలు కూడా వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతుంటాయి. కాపలాగా గట్టి బందోబస్తులను సైతం ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో విలువైన..astrazenca;india;ministerకరోనా వ్యాక్సిన్‌కూ దొంగల భయం.. దాచి పెట్టి మరీ!కరోనా వ్యాక్సిన్‌కూ దొంగల భయం.. దాచి పెట్టి మరీ!astrazenca;india;ministerTue, 12 Jan 2021 09:13:54 GMTజోహన్నెస్‌బర్గ్: ఇంతకుముందు వజ్రాలు, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను మాత్రమే చాలా భద్రంగా దాచుకునే వారు. ఎక్కడ తమ విలువైన వస్తువులను దొంగలు దోచుకుపోతారోనని అనుక్షణం భయపడేవారు. సామాన్య మానవులే కాదు.. ప్రభుత్వాలు కూడా వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతుంటాయి. కాపలాగా గట్టి బందోబస్తులను సైతం ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో విలువైన వస్తువు చేరింది. అదే కరోనా వ్యాక్సిన్. అవును ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కూడా బంగారం, వజ్రాల వంటి విలువైన వస్తువుల జాబితాలో చేరింది. ఈ వ్యాక్సిన్ నిల్వలను కూడా అత్యంత భద్రంగా గోప్యంగా కట్టుదిట్టమైన కాపలా నడుమ ప్రభుత్వం దాచిపెడుతోంది. అయితే ఇదంతా మన దేశంలో కాదులేంది. దక్షిణాఫ్రికాలో.

కరోనా వ్యాక్సిన్‌ నిల్వ విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. త్వరలో భారత్ నుంచి ఆ దేశానికి చేరనున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌లను రహస్య స్థావరంలో ఎవరికీ తెలియని ప్రాంతంలో నిల్వ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రతినిధి పోపో మాజా మీడియాకు తెలిపారు. టీకాలు దొంగతనంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయే ప్రమాదం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతే వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతాయని, అందువల్లే వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచి ప్రజలకు అందిస్తామని పోపో మాజా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్న దేశాల్లో భారీగా బ్లాక్‌ మార్కెట్‌ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించబోతోంది. దీనికోసం భారత్ నుంచి 1.5 మిలియన్‌ డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్‌ వ్యాక్సిన్లకు సంబంధించి దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జ్వేలీ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మన దేశం నుంచి ఆ దేశానికి వ్యాక్సిన్ డోసులు చేరనున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్‌ డోసులను అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా నిల్వ చేసేందుకు అక్కడి ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తు చేస్తోంది.




కోదండరామ్ కు టీ కాంగ్రెస్ షాక్!

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>