PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgసంక్రాంతి పండుగ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రతీ ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. భగవంతుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా ఎంతో వేడుకగా మూడు రోజులపాటు పండుగ జరుపుకొంటాం అని ఆయన అన్నారు. పుష్కలంగా పండే పంటలు భారతీpavan kalyan,janasena, ap;pawan;kalyan;kranthi;kranti;siri;makar sakranti;india;janasena;sankranthi;festival;media;culture;tdp;central government;janasena party;bhogiకేంద్రానికి పవన్ థ్యాంక్స్కేంద్రానికి పవన్ థ్యాంక్స్pavan kalyan,janasena, ap;pawan;kalyan;kranthi;kranti;siri;makar sakranti;india;janasena;sankranthi;festival;media;culture;tdp;central government;janasena party;bhogiTue, 12 Jan 2021 19:00:00 GMTసంక్రాంతి పండుగ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రతీ ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

భగవంతుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా ఎంతో వేడుకగా మూడు రోజులపాటు పండుగ జరుపుకొంటాం అని ఆయన అన్నారు. పుష్కలంగా పండే పంటలు భారతీయులకు సిరులను అందించే కాలం కావడంతో సంక్రాంతి సంబరాలు ఎంతో ఆడంబరంగా సాగుతాయి అని పవన్ పేర్కొన్నారు.  అయితే ఈ సంక్రాంతి పంటలతోపాటు కరోనా మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ కూడా తీసుకురావడం ఎంతో ఆనందదాయకం అని ఆయన వెల్లడించారు. సంక్రాంతి తరువాత భారతదేశంలో వ్యాక్సిన్ ప్రారంభం కావడం శుభ పరిణామం అని అన్నారు.

వ్యాక్సిన్ రూపకర్తలకు, ప్రోత్సహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మార్గదర్శకులైన అధికారులకు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు చెప్పారు పవన్ కళ్యాణ్. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ముఖ్యంగా తెలుగు వారి ఆచార, అభిరుచులను తెలియచేసే ఈ సంక్రాంతి పండుగ దేశ ప్రజలు, తెలుగు వారికి సిరి సంపదలతో కూడిన ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మదమాత్సర్యాలు, మత మౌఢ్యాలు భోగి మంటలలో దహనం కావాలని ఆశిస్తున్నాను అని అన్నారు. హైందవులు పరమ పుణ్య దినాలుగా భావించే ఈ ఉత్తరాయణ కాలం నుంచి పాలకులు ఆదర్శవంతమైన పాలన అందించాలని, జవాబుదారీతనాన్ని అవలంభించాలని ఆశిద్దాం అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అనుకూలమైన ప్రకృతితో దేశం సుభిక్షంగా శోభిల్లాలని కోరుకుంటూ నా తరఫున, జనసేన శ్రేణుల తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పారు పవన్ కళ్యాణ్.


కరోనా నుండి బయటపడ్డ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>