PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/narendra-modiaaf0203b-fc51-42af-b08b-8406c2d44a8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/narendra-modiaaf0203b-fc51-42af-b08b-8406c2d44a8a-415x250-IndiaHerald.jpgటీకా నాణ్యతపై సందేహాలు వెలిబుచ్చుతూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న వేళ.. దేశంలో తొలి టీకా మోదీకి వేయాలని పట్టుబట్టారు కొంతమంది నేతలు. మోదీ, అతని కేబినెట్ సహచరులకు ముందు టీకా వేసి, ఆ తర్వాత సామాన్య ప్రజలకు వేయాలని సూచించారు. టీకా సామర్థ్యంపై సందేహాలు వెలిబుచ్చారు. అయితే టీకా విషయంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారు. తనతో సహా ప్రజా ప్రతినిధులెవరూ తొలి దశలో టీకా వేయించుకోరని చెప్పారు. narendra modi;russia;narendra modi;american samoa;january;prime minister;cabinetతొలి టీకా నాకొద్దు.. మోదీ మెలిక..తొలి టీకా నాకొద్దు.. మోదీ మెలిక..narendra modi;russia;narendra modi;american samoa;january;prime minister;cabinetTue, 12 Jan 2021 07:15:00 GMTమోదీ, అతని కేబినెట్ సహచరులకు ముందు టీకా వేసి, ఆ తర్వాత సామాన్య ప్రజలకు వేయాలని సూచించారు. టీకా సామర్థ్యంపై సందేహాలు వెలిబుచ్చారు. అయితే టీకా విషయంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారు. తనతో సహా ప్రజా ప్రతినిధులెవరూ తొలి దశలో టీకా వేయించుకోరని చెప్పారు.

కేవలం ఆరోగ్య సిబ్బంది, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం మని చెప్పారు ప్రధాని మోదీ. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని అది తన వ్యక్తిగత సూచన అని చెప్పారు. ప్రజా ప్రతినిధులు ఫ్రంట్ లైన్ వారియర్స్ లో భాగం కాదని, అందుకే వారిని మినహాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన తన నిర్ణయాన్ని తెలియజేశారు.

అమెరికా, రష్యా, ఇజ్రాయె లాంటి కొన్ని దేశాల్లో ప్రముఖులు ముందుగా టీకాలు తీసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘కరోనా విస్తృతి విషయంలో అనేక దేశాల కంటే మన దేశం మెరుగ్గా ఉండడం సంతోషకరం. అయినా నిర్లక్ష్యం ఎంతమాత్రం పనికిరాదు. 6 నుంచి 8 నెలల క్రితం ప్రజల్లో కనిపించిన భయాందోళన ఇప్పుడు లేదు. ఈ పరిస్థితుల్లో టీకా ఇచ్చే కార్యక్రమంపై వదంతులు వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు జాగ్రత్త వహించాలి. వీటికి కళ్లెం వేయడంలో సామాజిక, మతపరమైన బృందాలను భాగస్వాముల్ని చేయాలి’ అని సూచించారు. ఇప్పటివరకు 50 దేశాల్లో 2.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందితే మన దేశంలో జనవరి 16 నుంచి మొదలయ్యే కార్యక్రమంలో మూడు కోట్ల మంతి కరోనా వారియర్స్ సహా మొత్తం 30 కోట్ల మందికి అందబోతోందని ప్రధాని చెప్పారు. కొన్ని నెలల్లోనే ఇంతమందికి టీకా వేయడం ప్రపంచంలోనే అతిపెద్ద కసరత్తుగా నిలిచిపోతుందన్నారు మోదీ.


ప్రేమ విషయంలో సీన్ రివర్స్.. యువకుడిపై యువతి కత్తితో దాడి..?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>