MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthakbafbba8e-b1a9-474b-8086-6fc62f26c6dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthakbafbba8e-b1a9-474b-8086-6fc62f26c6dc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని షోస్ కి కామన్ ఫ్యాన్స్ ఉంటే బిగ్ బాస్ కి మాత్రం సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రతీరోజూ బిగ్ బాస్ ని మిస్ కాకుండా చూసే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. మళ్ళీ ఇందులో ఒక్కో కంటిస్టెంట్ కి ఒక్కో డై హార్డ్ ఫ్యాన్ ఉంటారు. akhil sarthak;women;akhil akkineni;prema;tollywood;bigboss;jayalakshmi;love;woman;winner;prize;reality show;chatting;gift;winner1;fidaaబిగ్ బాస్ కాంటెస్టెంట్ అఖిల్ కి లాప్ టాప్ బహుమతి.. పంపింది ఎవరో తెలుసాబిగ్ బాస్ కాంటెస్టెంట్ అఖిల్ కి లాప్ టాప్ బహుమతి.. పంపింది ఎవరో తెలుసాakhil sarthak;women;akhil akkineni;prema;tollywood;bigboss;jayalakshmi;love;woman;winner;prize;reality show;chatting;gift;winner1;fidaaTue, 12 Jan 2021 20:30:00 GMTటాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని షోస్ కి కామన్ ఫ్యాన్స్ ఉంటే బిగ్ బాస్ కి మాత్రం సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రతీరోజూ బిగ్ బాస్ ని మిస్ కాకుండా చూసే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. మళ్ళీ ఇందులో ఒక్కో కంటిస్టెంట్ కి ఒక్కో డై హార్డ్ ఫ్యాన్ ఉంటారు. అప్పటివరకూ ఓ మోస్తరు క్రేజ్ తో ఉన్న కంటిస్టెంట్ కి బిగ్ బాస్ పుణ్యమా అని మరింత ఎక్కువ క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకి వచ్చేవరకూ ఆ తమ అభిమాన కంటిస్టెంట్ గెలుపు కోసం పరితపిస్తుంటారు. గెలిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రతీ సీజన్ లో ప్రతీ కంటిస్టెంట్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటూ వచ్చింది. విన్నర్ లైనా, రన్నర్ లైనా బయటకు వచ్చాక అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

బిగ్ బాస్ సీజన్ 4 లో విన్నర్ గా నిలిచిన అభిజీత్ కి అభిమానులు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టారో, అదే రేంజ్ లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కి కూడా బ్రహ్మరథం పట్టారు. తాను బయటకి వచ్చిన తర్వాత నుంచి అభిమానులతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వస్తున్నారు. పలు సీరియల్స్ లో నటించినా గాని రాని గుర్తింపు బిగ్ బాస్ వల్ల వచ్చిందని, ఆ అవకాశం ఇచ్చినందుకు బిగ్ బాస్ యజమాన్యానికి, తనని ఇంత వరకూ తీసుకొచ్చిన అభిమానులకి ఋణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఏదో ఒక టైమ్ లో అభిమానుల కోసం సమయం కేటాయించి వారితో లైవ్ లో మాట్లాడడం, చాటింగ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా ఇతని వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయిన అఖిల్ వీరాభిమాని, వీర మహిళాభిమాని ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ను ఇచ్చారు. అది కూడా అఖిల్ కి ఇష్టమైన ల్యాప్ టాప్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. విజయవాడకు చెందిన జయలక్ష్మి అనే మహిళ, అఖిల్ కు నచ్చిన ల్యాప్ టాప్ ను కొని మరి బహుమతిగా అందించారు. దానికి స్పందించిన అఖిల్, "నా మీద ఎందుకింత ప్రేమ, నేను చేసింది కూడా ఏమీ లేదు. మీ ప్రేమకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.




తెలుగులోనూ కేక పుట్టిస్తున్న విజయ్ ?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>