Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hasan36daad92-73f2-4724-9540-f2a7fa4dc70f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hasan36daad92-73f2-4724-9540-f2a7fa4dc70f-415x250-IndiaHerald.jpgశృతి హాసన్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాల్లో చేస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ గానే నిలిచాయి. మొదటి నుంచి దూకుడుగా సినిమాల్లో పాల్గొంటూ వచ్చింది ఈ చిన్నది. కానీ మధ్యలో ప్లాప్ లు ఈ అమ్మడును పలకరించడం వల్ల కొన్ని రోజులు సినిమాలకు కాస్త గ్యాప్ కూడా ఇచ్చింది. దాంతో ఈ చిన్నది ఇక సినిమాల్లో కనిపించదేమోనని అందరూ భావించారు. అలా అనుకున్నారో లేదో ఈ చిన్నది మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చేసింది. మాస్ మహారాజా క్రాక్ మూవీతో ప్రేక్షకులనుshruthi hasan;beauty;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sruthi;bollywood;tollywood;cinema;telugu;remake;heroine;pink;gabbar singh;dookudu;mass;krack;pawan-kalyan;katamarayuduవకీల్ సాబ్ లో.. నేను జెస్ట్ గెస్ట్ మాత్రమేవకీల్ సాబ్ లో.. నేను జెస్ట్ గెస్ట్ మాత్రమేshruthi hasan;beauty;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sruthi;bollywood;tollywood;cinema;telugu;remake;heroine;pink;gabbar singh;dookudu;mass;krack;pawan-kalyan;katamarayuduTue, 12 Jan 2021 15:00:00 GMTశృతి హాసన్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాల్లో చేస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ గానే నిలిచాయి. మొదటి నుంచి దూకుడుగా సినిమాల్లో పాల్గొంటూ వచ్చింది ఈ చిన్నది. కానీ మధ్యలో ప్లాప్ లు ఈ అమ్మడును పలకరించడం వల్ల కొన్ని రోజులు సినిమాలకు కాస్త గ్యాప్ కూడా ఇచ్చింది. దాంతో ఈ చిన్నది ఇక సినిమాల్లో కనిపించదేమోనని అందరూ భావించారు. అలా అనుకున్నారో లేదో ఈ చిన్నది మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చేసింది. మాస్ మహారాజా క్రాక్ మూవీతో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చింది. ఈ సినిమా లో తన నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఈ చిన్నది ఆనందం వ్యక్తం చేసింది.

‘క్రాక’ సినిమా హిట్ కొట్టడంతో ఈ చిన్నదానికి మరిన్ని సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసే అవకాశం లేకపోలేదు. అయితే తాజాగా వకీల్ సాబ్ లో తన పాత్ర గురించి  శృతి హాసన్ ఇశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. పింక్ రీమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. పవన్ సరసన కథానాయికగా  శృతి హాసన్ నటిస్తున్నదన్న సంగతీ తెలిసిందే. అయితే ఈ విషయం పై  శృతి హాసన్ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అందులో నేను హీరోయిన్ అసలే కాదంటూ మాట్లాడింది ఈ చిన్నది. వకీల్ సాబ్ సినిమాలో నేను నటిస్తున్న మాట ముమ్మాటికీ నిజమే కానీ.. అందులో నేను ఫుల్ లెంగ్త్ కథానాయికగా ఏమీ నటించడం లేదు.

ఆ సినిమాలో నా పాత్ర కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేశాను. అందులో పాత్ర నచ్చడంతో వకీల్ సాబ్ లో నటించాను. అంతకు మించి పవన్ సరసన నటించే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక నటించాను. అందుకే చిన్న పాత్ర అయినా ఈ మూవీలో కనిపించబోతున్నానని  శృతి హాసన్ చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్ సినిమాలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తోంది. అందుకే తెలుగులో ఆఫర్లు వస్తున్నా.. వాటికి కొంచెం దూరంగా ఉంటూ వస్తోంది. గబ్బర్ సింగ్ లెవల్లో పవన్,  శృతి హాసన్ సీన్స్ ఉండబోతాయని ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఆశలు పెట్టుకున్నారు. ముందే ఈ చిన్నది తన పాత్రపై క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని ముందే హింట్ ఇచ్చినట్టుంది. 


మహేష్ తో కొరటాల శివ మ్యాజిక్ చేయగలుగుతాడా...?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!

ప‌రిటాల శ్రీరామ్‌కు చంద్ర‌బాబు, లోకేష్ కంబైన్డ్ షాక్‌... దెబ్బ‌కొట్టారే..!

బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>