PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/achennayudu-sensational-comments-on-localbody-electionsb94269c5-0fe5-4bb3-997d-8bf1a1788953-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/achennayudu-sensational-comments-on-localbody-electionsb94269c5-0fe5-4bb3-997d-8bf1a1788953-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వచ్చిన తీర్పుల విషయంలో న్యాయమే గెలిచిందని, తమకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని చెబుతూ వచ్చేవారు టీడీపీ నేతలు. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ని హైకోర్టు రద్దు చేయడంతో.. టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుని తాము గౌరవిస్తున్నామని చెబుతూనే.. కోర్టుకి తప్పుడు సమాచారం అందించారంటూ విమర్శలు మొదలు పెట్టారు. achennayudu;kumaar;andhra pradesh;high court;panchayati;court;tdp;local language;ycp;ammavodi;nijamహైకోర్టు విచారణపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..హైకోర్టు విచారణపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..achennayudu;kumaar;andhra pradesh;high court;panchayati;court;tdp;local language;ycp;ammavodi;nijamTue, 12 Jan 2021 08:00:00 GMTటీడీపీ నేతలు. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ని హైకోర్టు రద్దు చేయడంతో.. టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుని తాము గౌరవిస్తున్నామని చెబుతూనే.. కోర్టుకి తప్పుడు సమాచారం అందించారంటూ విమర్శలు మొదలు పెట్టారు.

హైకోర్టుకి తప్పుడు సమాచారం..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉంటే ఎన్నికలు నిస్పక్షపాతంగా జరుగుతాయనే భయంతోనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై వెనకడుగేస్తోందని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చినా కూడా దాన్ని గౌరవించకుండా కోర్టులకు వెళ్లారని చెప్పారు. కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఎన్నికల షెడ్యూల్ రద్దయిందని చెప్పారు. మరోవైపు కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని కూడా చెప్పారాయన.

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా విజయం మాదేనంటూ విర్రవీగే వైసీపీ నేతలు.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ప్రజల మద్దతు వైసీపీకి ఉంటే.. ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. నిజంగా కరోనాయే కారణం అయితే అమ్మఒడి సభను అన్ని వేలమందితో ఎలా నిర్వహించారని మండిపడ్డారు. కేవలం ఎన్నికలను వాయిదా వేయాలని, నిమ్మగడ్డ పదవీ కాలంలో ఎన్నికలు జరగ కూడదనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరించారని చెప్పారు. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలనూ భాగస్వాములు చేశారని ఆరోపించారు. వైసీపీపై రోజు రోజుకీ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఎన్నికలు నిర్వహిస్తే ఆ విషయం బైటపడుతుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అధికార పక్షం కుట్ర లేకుండా, పారదర్శకంగా జరిగితే టీడీపీదే విజయం అని అన్నారు అచ్చెన్నాయుడు.

కరోనా టైమ్ లోనే ఇతర రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరిగాయని, పొరుగు రాష్ట్రం తెలంగాణలో సైతం ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. ఏపీకి వచ్చే సరికి ప్రభుత్వానికి ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటున్నారని అన్నారు.


ప్రేమ విషయంలో సీన్ రివర్స్.. యువకుడిపై యువతి కత్తితో దాడి..?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>