PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vaacienee88e12d4-da6a-4af6-909b-eeaf1398a355-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vaacienee88e12d4-da6a-4af6-909b-eeaf1398a355-415x250-IndiaHerald.jpgకోవిడ్ వ్యాక్సిన్లు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఏపీకి కేటాయించిన వ్యాక్సిన్లు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. తెలంగాణ వ్యాక్సిన్లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. తొలి దశలో ఏపీకి ఐదు లక్షల డోసులు, తెలంగాణకు నాలుగన్నర లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చినట్లు అధికారుల సమాచారం.covid vaaciene;telangana;district;central government;aadhar;shamshabadతెలుగు రాష్ట్రాలకు చేరిన కోవిడ్ టీకా!తెలుగు రాష్ట్రాలకు చేరిన కోవిడ్ టీకా!covid vaaciene;telangana;district;central government;aadhar;shamshabadTue, 12 Jan 2021 08:42:17 GMTతెలంగాణ వ్యాక్సిన్లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి. తొలి దశలో ఏపీకి ఐదు లక్షల డోసులు, తెలంగాణకు నాలుగన్నర లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చినట్లు అధికారుల సమాచారం.
హెడ్ క్వార్టర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ డోస్‌లు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయి. పోలీసు భద్రత నడుమ గ్రామస్థాయి వరకు వ్యాక్సిన్ వెళ్లినట్లుగానే వీటి నిల్వ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే చేపట్టేలా ఫ్రీజర్లు, ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్లను వైద్యారోగ్య శాఖ సమకూర్చింది.

     ఏపీకి కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌  టీకాలు వచ్చాయని సమాచారం.ఏపీకి తొలివిడత కింద సుమారు 5 లక్షల డోసులు రాగా..ఇందులో సుమారు 4 లక్షల డోసులు పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ఉన్నట్లు సమాచారం.  ఏపీలో తొలివిడత కింద 3,82,899 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తారు. వీరి వివరాలను కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మొత్తం 1,940 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ టీకా వేయాలంటే 40,410 కేంద్రాలు అవసరం అవుతాయని అంచనా. 17,775 మందికి వ్యాక్సినేటర్లను సిద్ధం చేశారు.

             వ్యాక్సిన్ పంపిణి కోసం  తెలంగాణలో  తొలి రోజు 139 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 40 ప్రైవేటు ఆసుపత్రులలో ఉంటే మిగిలిన 99 ప్రభుత్వాసుపత్రులలోనే ఏర్పాటయ్యాయి. ప్రతీ కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున వ్యాక్సిన్ ఇచ్చేలా రంగం సిద్ధమైంది. ‘ఇప్పటికే సుమారు 2.90 లక్షల మంది పేర్లు ‘కొవిన్’లో నమోదయ్యాయి. తొలి రోజున 13,900 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుంది. 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాలలో మొత్తం 1400 సెషన్లలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కొన్ని చోట్ల అనుబంధ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున రోజుకు 1.40 లక్షల మందికి ఇవ్వాలని ప్లాన్ రెడీ అయింది.
 
             ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రంలో డాక్టరుతో పాటు వ్యాక్సిన్ వేయడానికి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీ, రియాక్షన్ లాంటివాటిని పరిశీలించడానికి అబ్జర్వేషన్ రూమ్‌లు, హెల్త్ కేర్ సిబ్బంది వేచి ఉండడానికి వెయిటింగ్ హాళ్ళు ఏర్పాటయ్యాయి.వ్యాక్సిన్‌ వేయించుకునే ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. వ్యాక్సినేషన్‌ అయిపోయిన అనంతరం వీరి వివరాలు కో–విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేస్తారు.  


ప్రేమ విషయంలో సీన్ రివర్స్.. యువకుడిపై యువతి కత్తితో దాడి..?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>