SpiritualityVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/bhogi-pallu--bhogi-mantalu-sankranthia20d3f25-a138-4bdf-905d-6242589c62c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/bhogi-pallu--bhogi-mantalu-sankranthia20d3f25-a138-4bdf-905d-6242589c62c3-415x250-IndiaHerald.jpgసంక్రాంతి పండుగ పేరు చెప్పగానే పచ్చని పొలాలతో నిండిపోయే పల్లెటూళ్ళు గుర్తుకు వస్తాయి. ఇక కోడి పందాలు, డూడూ బసవన్నలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు అబ్బో ఒకటేమిటి పండగ వాతావరణం పల్లె పల్లెల్లో వెల్లివిరుస్తుంది. ఆంధ్రా ప్రజలు జరుపుకునే అత్యంత...bhogi pallu , bhogi mantalu, sankranthi;kirti;kranthi;kranti;surya sivakumar;makar sakranti;sankranthi;january;festival;bhogi;santosham“భోగి” ప్రాధాన్యత తెలుసా...?? భోగి పళ్ళ ఎందుకు పోస్తారో తెలుసా..??“భోగి” ప్రాధాన్యత తెలుసా...?? భోగి పళ్ళ ఎందుకు పోస్తారో తెలుసా..??bhogi pallu , bhogi mantalu, sankranthi;kirti;kranthi;kranti;surya sivakumar;makar sakranti;sankranthi;january;festival;bhogi;santoshamTue, 12 Jan 2021 22:52:59 GMTసంక్రాంతి పండుగ పేరు చెప్పగానే పచ్చని పొలాలతో నిండిపోయే పల్లెటూళ్ళు గుర్తుకు వస్తాయి. ఇక కోడి పందాలు, డూడూ బసవన్నలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు అబ్బో ఒకటేమిటి పండగ వాతావరణం పల్లె పల్లెల్లో వెల్లివిరుస్తుంది. ఆంధ్రా ప్రజలు జరుపుకునే అత్యంత పెద్ద పండుగ సంక్రాంతి మాత్రమే. అయితే సంక్రాంతి మూడు రోజుల్లో మొదట జరుపుకునేది భోగి పండుగ. అసలు ఈ భోగి పండుగ ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారో, ఈ విధంగానే ఈ పండుగను జరుపుకోవాలని ఎలా చెప్పబడింది. అసలు భోగిపళ్లు ఎందుకు పోస్తారు, భోగిపళ్లు పోయడం వెనుక అంతరార్ధం ఏమిటి  అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 భోగి పండుగ జనవరి నెలలో రెండవ వారంలో 13 లేదా ఒక రోజు అటు ఇటుగా వస్తుంది అంటే సూర్యుడు దక్షిణం వైపుగా దూరమవుతూ దక్షిణ అర్ధ గోళంలో భూమికి దూరం అవుతాడు. ఈ క్రమంలోనే చలి తీవ్రత అధికంగా ఉంటుంది. చలిగాలుల నుంచి తట్టుకోవడానికి ఆ సమయంలో రాత్రి మొదలు మంటలు వేసుకుని చలికాచుకుంటారు. భోగి రోజున మాత్రమే ఈ మంటలు వేసుకుంటారు భగ భగ మండే మంటలతో అందరూ చలి కాచుకుంటారు కాబట్టే ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది...అలాగే
భోగి రోజుకు పేరు ఎలా వచ్చిందనే దానికి మరోక కారణం కూడా ఉంది. సంక్రమణ మహాపర్వానికి ముందురోజును భోగి పర్వం అంటారు. భోగము అంటే అనుభవం అని అర్థం అసలు భోగము అంటూ మనం చేసే పని సంతోషంగా అనుభవించడమే భోగి రోజుగా కీర్తింప బడుతుంది. భోగి రోజ మరో 10 రోజుల్లో వస్తుందనగానే అందరూ తాటాకు ఆకులు, ఎండిన పెద్ద మొద్దులు తెచ్చి ఇళ్ళ ముందు భోగిమంట వేస్తారు. తెల్లవారుజామున 3 సమయానికే మొదలు పెట్టె ఈ భోగి మంటలో పెద్దా చిన్న తేడా లేకుండా చలికాచుకుంటూ కబుర్లు చెప్తూ, అదే భోగి మంటలో ఉదయం వేడి నీళ్ళు కాచుకుని, అన్నం వండుకుని తింటారు. ఇక భోగిపళ్లు పిల్లపై పోసి దీవిస్తారు, భోగిపళ్లు చిన్న పిల్లలపై పోయడం వలన శ్రీమహావిష్ణువు నేరుగా ఆశిర్వదిస్తాడని భావిస్తారు.  ఆ రోజు అమ్మవారిని ప్రార్దిస్తూ భోగ భాగ్యాలు ప్రసాదించమని వేడుకుంటారు.


బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో.. మన ర్యాంక్ ఎంతో చెప్పిన జాబితా.. అగ్రస్థానం మళ్లీ వాళ్లకే!

త్రివిక్రమ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో.. ఏమని చెప్పాడంటే

‘మాస్టర్’ లీక్ చేసిందెవరో తెలిసిపోయింది.. ఎవరో తెలుసా?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>