Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime3dab74f2-01f2-41e4-a4ea-21e08ccd2c92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime3dab74f2-01f2-41e4-a4ea-21e08ccd2c92-415x250-IndiaHerald.jpgభోపాల్: మ‌ధ్యప్ర‌దేశ్‌లో క‌ల్తీ మద్యం కాటేయ‌డంతో మంగ‌‌ళ‌వారం ఉద‌యం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క‌ల్తీ మ‌ద్యం సేవించి 11 మంది మ‌ర‌ణించారు. మ‌రికొంత మంది తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. ఈ విషాద ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని మోరెనా జిల్లా‌లో చోటుచేసుకుంది. విష‌యం తెలుసుకున్న అధికారులు సంబంధింత ప్రాంతాల‌కు చేరుకుని బాధితుల‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయార‌నీ, ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారcrime;madhya pradesh - bhopal;district;police;village;2020;october;bhopalక‌ల్తీ మద్యం తాగి 11 మంది మృతిక‌ల్తీ మద్యం తాగి 11 మంది మృతిcrime;madhya pradesh - bhopal;district;police;village;2020;october;bhopalTue, 12 Jan 2021 11:24:27 GMT
ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మాట్లాడుతూ.. క‌ల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన మృతులు, బాధితులు  చెహ్రా మాన్‌పూర్, పెహ్‌వాలీ ప్రాంతాల‌కు చెందిన వార‌ని తెలిపారు. పెహ్‌వాలీ గ్రామంలో ముగ్గురు, మాన్‌పూర్ గ్రామంలో ఎనిమిది మంది మ‌ర‌ణించారు. ఈ ప్రాంతాలు జిల్లా కేంద్రానికి 20 కిలో మీట‌ర్ల దూరంలో ఉంటాయి. ప్ర‌స్తుతం ఇంకా ఏడు మంది గ్వాలియ‌ర్‌లో ఉన్న ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్న వారి భ‌ర‌తం ప‌ట్టేందుకు ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేసింది.

కాగా, మ‌‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2020 అక్టోబరులోనూ కల్తీ మద్యం కార‌ణంగా 15 మంది  కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మధ్యప్రదేశ్ లోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే పొరపాటే. దేశం లో ఏదో ఒకచోట ఇలాంటి కల్తీ మద్యం వ్యవహారం నడుస్తూనే ఉంది. తాజాగా తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో కూడా కల్తీ కల్లు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దీని భారిన పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడో ఒక చోట ఈ కల్తీ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. తక్షణమే ఈ కల్తీ మద్యం వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే దీని భారిన పడి ఇంకెంత మంది బలిఅవుతారో.. ఇప్పటికే చాలా మంది ఈ కల్తీ మహమ్మారిన పడి ప్రాణాలు కోల్పోయారు..


టీ తాగే సమయంలో ఈ పదార్థాలను అస్సలు తినకూడదట?

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?

పండుగకు సొంతూరు వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..!?

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>