PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/datthatreya1a98d21b-e26f-41a6-8192-b25fa81cf353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/datthatreya1a98d21b-e26f-41a6-8192-b25fa81cf353-415x250-IndiaHerald.jpgఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే సీఎం జగన్ ను హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు.జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా దత్తాత్రేయను కలిశారు.datthatreya;darshana;gautham new;gautham;kranthi;kranti;makar sakranti;bandaru dattatreya;bandara;jagan;velam palli srinivasa rao;vijayawada;andhra pradesh;himachal pradesh;sankranthi;yv subbareddy;chief minister;minister;governor;y v subbareddy;kavuru srinivas;tirumala tirupathi devasthanam;jayam;anandamఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!datthatreya;darshana;gautham new;gautham;kranthi;kranti;makar sakranti;bandaru dattatreya;bandara;jagan;velam palli srinivasa rao;vijayawada;andhra pradesh;himachal pradesh;sankranthi;yv subbareddy;chief minister;minister;governor;y v subbareddy;kavuru srinivas;tirumala tirupathi devasthanam;jayam;anandamTue, 12 Jan 2021 14:04:49 GMTఏపీ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే సీఎం జగన్ ను హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు.జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా దత్తాత్రేయను కలిశారు.

 అలాగే ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను  గవర్నర్‌ బండారు దత్తాత్రేయ  దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్‌కు ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు.కోవిడ్ వ్యాక్సిన్‌ను తెలుగు వారు కనుగొనటం గర్వించదగ్గ అంశంమన్నారు..

గవర్నర్ అయిన తర్వాత ఆయన మొదటి సారిగా ఆయన  అమ్మవారిని దర్శించుకున్నారు.రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ బండారు దత్తాత్రేయతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు.తన పర్యటనలో భాగంగా విజయవాడ విచ్చేసిన దత్తాత్రేయను.. గేట్ వే హోటల్‌లో గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్‌ను బండారు దత్తాత్రేయ శాలువతో సత్కరించారు.మంగళవారం స్వామి వివేకానంద 158వ జయంతిని నగరంలోని రాఘవయ్య పార్క్ వద్ద  నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన  దత్త్రేయ  మాట్లాడుతూ.. భారతదేశం కోసం వివేకానంద తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు . వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతదేశం అగ్రగామిగా కావాలంటే యువత పాత్ర ముఖ్యమైనదని దత్తాత్రేయ తెలిపారు. దేశంలోని యువత మత్తు, మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారన్నారు. యువత అన్నిరంగాల్లో ముందజలో ఉండాలని దత్తాత్రేయ పేర్కొన్నారు.





బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>