KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children0edc14dc-6cf1-4631-90bd-bf63d17cc67b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children0edc14dc-6cf1-4631-90bd-bf63d17cc67b-415x250-IndiaHerald.jpgచిన్నపిల్లలు ఆహారం తినకుండా చాల మారం చేస్తుంటారు. ఇక పిల్లలు శారీరక, మానసిక ఎదుగుదలకు అన్నిరకాల పోషకాలు ఉండే సమతులాహారం చాల అవసరం. ఎదుగుతున్న పిల్లలకు విటమిన్లు, ఖనిజాలు, ఇతర సూక్ష్మ పోషకాలు సరిగ్గా అందేలా చూడాలి. అయితే మనం రోజు తీసుకునే కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా, కెలొరీలు తక్కువగా ఉంటాయి. చాల మంది పిల్లలు కూరగాయలను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు.children;chiranjeevi;samatha;tara;spinachబుడుగు: కూరగాయల వంటల్ని పిల్లలు తినట్లేదా... ఇలా చేయండి..!?బుడుగు: కూరగాయల వంటల్ని పిల్లలు తినట్లేదా... ఇలా చేయండి..!?children;chiranjeevi;samatha;tara;spinachTue, 12 Jan 2021 17:00:00 GMT
అయితే సాధారణంగా పిల్లలు కొత్త రుచులను ఎక్కువగా ఇష్టపడతారు. రోజూ ఒకేరకమైన రుచి ఉండే పదార్థాలను వారు దగ్గరకు రానివ్వరు. అందువల్ల అన్నం, రోటీలతో పాటు క్యారెట్లు, ఉల్లిపాయలు, పాలకూర, దోసకాయ, టమాటాలు వంటివన్నీ పిల్లలకు ప్లేట్‌లో పెట్టి ఇవ్వాలి. కూరగాయలు, ఆకుకూరలతో ఎలాంటి కొత్తరకం వంటకాలు చేయవచ్చో వారికి వివరించాలి. పిల్లలు సహజంగానే ఇలాంటి కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు. అందువల్ల వారి అభిప్రాయంతో, వారికి ఇష్టమైన పదార్థాలనే తినిపించాలి. కొత్త రెసిపీని చేసేటప్పుడు దాంట్లో వాడే మసాలాలు, సుగంధద్రవ్యాలు రుచికి ఎలా కారణమవుతాయో వివరించాలి. ఇవన్నీ కొత్త రకం వంటలపై వారికి ఆసక్తిని పెంచడంతోపాటు ఆకలిని కూడా ప్రేరేపిస్తాయి.

ఇక కూరగాయల్లో ఉండే పోషకాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వివిధ రకాల కూరలు, దుంపలు, ఆకుకూరల వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వివరించాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో కూరగాయలు కొద్దిమొత్తంలోనైనా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో కూరగాయలతో చేసిన వంటకాలు క్రమం తప్పకుండా ఉండాలి. కానీ రోజూ ఒకేలా కాకుండా కొత్త రుచులను వారికి పరిచయం చేయాలి. దీనివల్ల వాటిని తినేందుకు పిల్లలు మానసికంగా సన్నద్ధమవుతారు.

అయితే చిన్నపిల్లలు సహజంగానే బయట దొరికే కేకులు, చిప్స్, క్యాండీలు, ఇతర చిరుతిళ్లను ఇష్టపడతారు. వాటి వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి, కూరగాయల ప్రయోజనాల గురించి వారికి ఆ వయసులో పెద్దగా తెలియదు. అందువాల్ల కోపంతో, బలవంతంగా వారి ఆహారపు అలవాట్లను మార్చే ప్రయత్నం చేయకుండా ఓపికతో వ్యవహరించాలి. వివిధ రకాల కూరగాయలు, బంగాళాదుంప, క్యారెట్ వంటి దుంపలు, ఆకుకూరలను క్రమంగా వారికి అలవాటు చేయాలి. పిల్లలు కూడా ఎదిగే క్రమంలో వాటి ఉపయోగాలను తెలుసుకుంటూ, వాటిపై ఇష్టం పెంచుకుంటారు.


త్రివిక్రం తో రామ్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>