PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodandaram434b220d-41f5-4139-9604-1e9f3a3926ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodandaram434b220d-41f5-4139-9604-1e9f3a3926ce-415x250-IndiaHerald.jpgపట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ మద్దతుపై గంపెడు ఆశలతో ఉన్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మెన్ కోదండరామ్ కు ఆ పార్టీ షాకిచ్చింది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా నిర్ణయించింది. kodandaram;telangana;congress;kanna lakshminarayana;tpcc;assembly;gandhi bhavan;jac;partyకోదండరామ్ కు టీ కాంగ్రెస్ షాక్!కోదండరామ్ కు టీ కాంగ్రెస్ షాక్!kodandaram;telangana;congress;kanna lakshminarayana;tpcc;assembly;gandhi bhavan;jac;partyTue, 12 Jan 2021 09:15:02 GMTతెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ మద్దతుపై గంపెడు ఆశలతో ఉన్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మెన్ కోదండరామ్ కు ఆ పార్టీ షాకిచ్చింది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా నిర్ణయించింది. ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కోదండరామ్. ఆయన ప్రచారం కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆయన విన్నవించారు.

       2018 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంది టీజేఎస్.కాంగ్రెస్ కూటమి గెలుపు కోసం కోదండరామ్ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. అంతేకాదు పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు కోసం మొదట పట్టుబట్టిన టీజేఎస్.. తర్వాత చాలా సీట్లలో పోటీకి వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ పెద్దల హామీతోనే టీజేఎస్ కొన్ని సీట్లు తగ్గించుకుందనే చర్చ జరిగింది. దీంతో ఎమ్మెల్సీగా కోదండరామ్ స్వయంగా పోటీ చేస్తున్నందున.. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల స్థానంలో ఆయనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని అందరూ భావించారు. కాని గాంధీభవన్ లో సోమవారం జరిగిన సమావేశంలో మాత్రం మండలి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా సొంతంగానే రెండు సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలుస్తోంది.

           ఈ స్థానానికి  టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి మద్దతు కోసం విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ వేశారు. ఇతరులకు మద్దతు ఇచ్చే దాని కన్నా తామే బరిలో ఉందామని, పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు న్నాయని ఆయా జిల్లాల మెజారిటీ నేతలు కమిటీకి సూచించినట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 


హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>