PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronac0550209-7635-4dec-946a-162e1d467f66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronac0550209-7635-4dec-946a-162e1d467f66-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చింది దాంతో గత ఏడాది అంతా గడచింది. ఇపుడు కరోనా వ్యాక్సిన్ వస్తోంది. దాంతో ఈ ఏడాది అంతా ఒక భారీ ప్రొగ్రాం కొనసాగేలా ఉంది. కరోనాతో ఎంతో మంది దేశంలో చనిపోయారు. ఇపుడు కాస్తా నెమ్మదించినట్లుగా కనిపించినా కరోనా మహమ్మారి ఎపుడు విరుచుకుపడుతుందో ఎవరికీ తెలియదు. carona;modi;central governmentటీకా లెక్క తేల్చిన మోడీ...వారి సంగతేంటి...?టీకా లెక్క తేల్చిన మోడీ...వారి సంగతేంటి...?carona;modi;central governmentTue, 12 Jan 2021 22:00:00 GMT
దాంతో కరోనా టీకాలు తీసుకోవ‌డం అవసరం. ఇది ఎవరో చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గట్టిగానే హెచ్చరిస్తోంది. అంతే కాదు ఏ కొందరికో ఇచ్చి మమ అనిపించేయకుండా ప్రపంచంలో ఉన్న ప్రతీ మానవుడికీ కరోనా టీకా అందాల్సిన అవసరం ఉందని గట్టిగా నొక్కి చెబుతోంది.

మరి ఇదిలా ఉంటే మన దేశంలో మాత్రం తొలి దశ కరోనా టీకాల పంపిణీ ప్రక్రియ ఈ నెల 16 నుంచి మొదలవుతోంది. ఈ టీకాలను ఫ్రంట్ లైన్ వారియర్స్ కే ఇస్తారు. అంటే దేశవ్యాప్తంగా లెక్క తీస్తే వారు మూడు కోట్ల మంది ఉంటారని అంటున్నారు. ఈ లెక్కలను చెప్పిన మోడీ తొలి దశలో వారికే టీకాలు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అలా మొత్తంగా ముప్పయి కోట్ల మంది దాకా తొలి దశలో టీకాలను పంపిణీ చేస్తామని, ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద కార్యక్రమం అని  కూడా చెబుతున్నారు.

సరే ఇవన్నీ ఇలా ఉంచితే మూడు కోట్ల మందికి మాత్రమే ఉచితంగా కరోనా టీకా అందుతుందని మోడీ మాటల ద్వారా తెలుస్తోంది.మిగిలిన వారి సంగతి ఏంటి అంటే వారు డబ్బులు పెట్టి కొనుక్కోవాలా లేక ఎవరు వారికి అందిస్తారు అన్నది మాత్రం స్పష్టం చేయలేది. మరో వైపు కరోనా టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా మాత్రమే  చేస్తామని కేంద్రం చెబుతోంది. ఆ మాటలను బట్టి చూస్తే రాష్ట్రాలు కరోనా టీకాలను కొనుగోలు చేసి తమ ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉంటుందేమో.

మరి రాష్ట్రాలు ఇదంతా అదనపు భారంగా భావిస్తే మాత్రం ప్రజలే కరోనా టీకాలను కొనుగోలు చేసుకోవాలి. ఇదంతా కూడా కేవలం ముప్పయికోట్ల మేర ప్రజలకు దక్కే టీకాల విషయంలో మాత్రమే. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాలు ఉన్నారు. అందరికీ టీకా ఉచితం అన్న మాట ఆచరణలో సాధ్యపడుతుందా కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుందా అంటే ఇప్పటికైతే క్లారిటీ లేదు. అంటే ఫ్రీ టీకాలు మాత్రం మూడు కోట్లు మాత్రమే అనుకోవాలేమో.




వామ్మో ....ఆదాశర్మ బీచ్ లో ఎం చేసిందో తెలుసా .

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>