MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purijagannathcd9095cf-41f6-442f-8f3d-4e6d9df83458-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purijagannathcd9095cf-41f6-442f-8f3d-4e6d9df83458-415x250-IndiaHerald.jpgకరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా వాళ్లంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. షూటింగులకు బ్రేకులు పడటంతో వారిలో ఉన్న ఇతర ట్యాలెంట్లను చూపించుకున్నారు చాలా మంది సెలబ్రిటీలు. సందీప్ రెడ్డి వంగా ఇంట్లో పనులు చేస్తూ పెట్టిన వీడియో ఆ తర్వాత బాగా ట్రెండ్ అయిపోయింది. దాదాపు టాలీవుడ్‌లోనిpurijagannath;jeevitha rajaseskhar;puri jagannadh;sandeep;tara;vijay;vijay deverakonda;india;tollywood;cinema;media;director;hero;joseph vijay;reddy;fighter;devarakondaచాలా పనుంది.. సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నా: పూరీ జగన్నాథ్చాలా పనుంది.. సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నా: పూరీ జగన్నాథ్purijagannath;jeevitha rajaseskhar;puri jagannadh;sandeep;tara;vijay;vijay deverakonda;india;tollywood;cinema;media;director;hero;joseph vijay;reddy;fighter;devarakondaTue, 12 Jan 2021 22:10:12 GMTసినిమా వాళ్లంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. షూటింగులకు బ్రేకులు పడటంతో వారిలో ఉన్న ఇతర ట్యాలెంట్లను చూపించుకున్నారు చాలా మంది సెలబ్రిటీలు. సందీప్ రెడ్డి వంగా ఇంట్లో పనులు చేస్తూ పెట్టిన వీడియో ఆ తర్వాత బాగా ట్రెండ్ అయిపోయింది. దాదాపు టాలీవుడ్‌లోని బిగ్ సెలబ్రిటీలందరూ ఆ చాలెంజ్‌లో పాల్గొని చూపించారు. ఇక టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం లాక్‌డౌన్ సమయంలో తనలోని మరో కోణాన్ని చూపించారు. పూరి జగన్నాథ్ సినిమాలు ఎలా ఉంటాయో.. బయట కూడా ఆయన డైలాగులు అదే విధంగా ఉంటాయి. పూరి జగన్నాథ్ తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు.

అందుకేనేమో జీవితం గురించి అందరూ ఒకలా చెబితే ఆయన మరో విధంగా చెబుతారు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో వివిధ అంశాలపై పూరీ తన అభిప్రాయాలను `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ప్రేక్షకులకు చెప్పడం మొదలుపెట్టారు. ఆ మ్యూజింగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చాలా మంది ఆ మ్యూజింగ్స్ వల్ల తమకు జ్ఞానోదయం కూడా అయిందంటూ చెప్పుకొచ్చారు. అయితే చాలా నెలల నుంచి కంటిన్యూ చేస్తున్న ఆ మ్యూజింగ్స్‌కు ఇప్పుడు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాకు కొంత కాలం బ్రేక్ ఇస్తున్నానని, తనకు పని మీద పని చేయాల్సి ఉందని ఆయన తాజాగా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం యంగ్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా `ఫైటర్` పేరుతో భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆయనకు సొంత బ్యానర్ కూడా ఉండటంతో ఇటు దర్శకుడిగానే కాకుండా అటు నిర్మాతగా కూడా ఆయనకు అనేక పనులు వచ్చి పడినట్టు అర్థమవుతోంది.




ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>