SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/warnerd4b1e6cc-08d9-4ee2-8928-fdb8e6940adb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/warnerd4b1e6cc-08d9-4ee2-8928-fdb8e6940adb-415x250-IndiaHerald.jpgభారత ఆటగాళ్ళపై ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంపై ఆసీస్ క్రికెటర్ వార్నర్ స్పందించాడు. టీమిండియాతో పాటు, సిరాజ్‌కు వార్నర్ క్షమాపణలు చెప్పాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా జాతి వివక్ష, దుర్భాషలాడటం ఆమోదించదగినవి కాదని, ఇకపై తమ ప్రేక్షకుల నుంచి ఇలాంటివి చోటు చేసుకోవద్దని ఆశిస్తున్నట్లు చెప్పాడు.warner;hyderabad;cricket;india;australia;bcci;indian;chris morrisమనోళ్ళు విదేశీ క్రికెటర్లను అభిమానిస్తే వాళ్ళేంటి ఇలా చేస్తున్నారుమనోళ్ళు విదేశీ క్రికెటర్లను అభిమానిస్తే వాళ్ళేంటి ఇలా చేస్తున్నారుwarner;hyderabad;cricket;india;australia;bcci;indian;chris morrisTue, 12 Jan 2021 22:53:00 GMTభారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతం అని చెప్పవచ్చు ఇండియాలో క్రికెట్ కు అభిమానులు చాలా ఎక్కువ భారత అభిమానులు క్రికెట్ ఆటను ఎంత ఆస్వాదిస్తారో క్రికెటర్లను కూడా అంతే అభిమానిస్తారు. తమకు నచ్చిన ఆటగాడు అంటే పడి చస్తారు.ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ వల్ల భారత అభిమానులు స్వదేశీ ఆటగాళ్లనే కాకుండా విదేశీ ఆటగాళ్లను కూడా అదే స్థాయిలో అభిమానించడం మొదలుపెట్టారు. ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, క్రిస్ గేల్ ఇలా చాలా మంది ఆటగాళ్లకు మనోళ్ళు వీరాభిమానులుగా తయారయ్యారు. అయితే భారత అభిమానులు క్రికెటర్లను ఇంత అభిమానిస్తే విదేశీ అభిమానులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం బాధాకరం అని చెప్పొచ్చు.

 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భాగంగా శని, ఆదివారం రోజున బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌పై పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇక ఘటనపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది.ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంపై ఆ దేశ ఆటగాడు డేవిడ్ వార్నర్ స్పందించాడు. టీమిండియాతో పాటు, సిరాజ్‌కు వార్నర్ మంగళవారం క్షమాపణలు చెప్పాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా జాతి వివక్ష, దుర్భాషలాడటం ఆమోదించదగినవి కాదని పేర్కొన్నాడు. ఇకపై తమ ప్రేక్షకుల నుంచి ఇలాంటివి చోటు చేసుకోవద్దని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

కాగా డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ జర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్నర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక లాక్ డౌన్ సమయంలో వార్నర్  తెలుగు పాటలకు టిక్ టాక్ వీడియోలు చేయడం అతన్ని తెలుగు అభిమానులకు మరింత చేరువ చేసిందనే చెప్పవచ్చు. 



నిమ్మగడ్డ కథలో ట్విస్ట్....జగన్ భారీ క్లైమాక్స్ రెడీ చేశారా?

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో.. మన ర్యాంక్ ఎంతో చెప్పిన జాబితా.. అగ్రస్థానం మళ్లీ వాళ్లకే!

త్రివిక్రమ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో.. ఏమని చెప్పాడంటే

‘మాస్టర్’ లీక్ చేసిందెవరో తెలిసిపోయింది.. ఎవరో తెలుసా?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>