MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crack84af68d6-7390-4ec3-a965-fe01aa4722fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crack84af68d6-7390-4ec3-a965-fe01aa4722fe-415x250-IndiaHerald.jpgరవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా కలెక్షన్స్ విషయంలో కిరాక్ పుట్టిస్తుంది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. కలెక్షన్ల విషయంలో కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది. అయితే ఇప్పుడు విడుదల చేసినా కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో వర్కవుట్ కాదని చాలా మంది అన్నారు. crack;ravi;gopichand;kranthi;kranti;lakshman;raja;ram pothineni;ravi teja;makar sakranti;cinema;sankranthi;january;letter;v;solo bathuke so better;mass;raccha;krack;fidaa;chitramమాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ మూడో రోజు కలెక్షన్స్ పరిస్థితేంటి..?మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ మూడో రోజు కలెక్షన్స్ పరిస్థితేంటి..?crack;ravi;gopichand;kranthi;kranti;lakshman;raja;ram pothineni;ravi teja;makar sakranti;cinema;sankranthi;january;letter;v;solo bathuke so better;mass;raccha;krack;fidaa;chitramTue, 12 Jan 2021 09:00:00 GMTరవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా కలెక్షన్స్ విషయంలో కిరాక్ పుట్టిస్తుంది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. కలెక్షన్ల విషయంలో కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది. అయితే  ఇప్పుడు విడుదల చేసినా కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో వర్కవుట్ కాదని చాలా మంది అన్నారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు 12 కోట్ల షేర్ మాత్రమే రావడంతో రవితేజ సినిమా ఎంత వసూలు చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఇక సంక్రాంతి సీజన్‌లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది. క్రాక్ వచ్చిన రోజు నుంచి కలెక్షన్స్ కిరాక్ పుట్టిస్తుంది.

అయితే తొలిరోజు షోలు క్యాన్సిల్ కావడం.. కేవలం నైట్ షోలు మాత్రమే పడటంతో రెండో రోజు 6.23 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. అందులో నైజాంలోనే దాదాపు రెండున్నర కోట్ల షేర్ ఉంది. ఇదిలా ఉంటే మూడో రోజు అంటే జనవరి 11న కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ట్రేడ్ నుంచి కొన్ని లెక్కలు వచ్చాయి. రెండో రోజు నుంచి మూడో రోజుకు వసూళ్లలో ఏ మాత్రం డ్రాప్ కనిపించకపోవడం గమనార్హం.

రవితేజ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా జూలు విదిలిస్తున్నాడు. వింటేజ్ రవితేజ అంటూ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ వాళ్లు పూనకాలు తెప్పించేలా థియేటర్స్ లో గోల చేస్తున్నారు. వింటేజ్ రవితేజ అంటూ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ వాళ్లు పూనకాలు తెప్పించేలా థియేటర్స్ లో గోల చేస్తున్నారు.

ఇక గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సులకు అద్భుతమైన పేరు వచ్చింది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కు ఫిదా అవుతున్నారంతా. కలెక్షన్స్ ఈ స్థాయిలో రావడానికి.. క్రాక్ ఇంతగా ప్రేక్షకులకు చేరువ కావడానికి రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కూడా కారణమే. మూడో రోజు కూడా దాదాపు 4 కోట్ల వరకు షేర్ వచ్చేలా కనిపిస్తుంది. ఇదంతా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. 


ఎవరినీ వదిలిపెట్టని కేసీఆర్ ? కారణం ?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>