PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news452d48ef-c9ed-42e5-a965-98a449e0e29d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news452d48ef-c9ed-42e5-a965-98a449e0e29d-415x250-IndiaHerald.jpgఇటీవలే అమెరికాలో జరిగిన అద్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ చేతిలో ఓడిన డొనాల్డ్ ట్రంప్... అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైనా అధ్యక్ష పదవి నుంచి దిగపోవడానికి ఆయనకు మనస్కరించడం లేదు. ఇందులో భాగంగానే తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా వ్యవహరించి, క్యాపిటల్ భవనంపై దాడికి ఉసిగొల్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గడువుకి ముందే ఆయనను అధ్యక్ష పీఠం నుంచి సాగనంపాలనే నిర్ణయానికి వచ్చారు. trump;tara;american samoa;donald trump;police;january;capital;partyఅమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడిగా నిలవనున్న ట్రంప్!అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడిగా నిలవనున్న ట్రంప్!trump;tara;american samoa;donald trump;police;january;capital;partyTue, 12 Jan 2021 12:25:00 GMTఅమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైనా అధ్యక్ష పదవి నుంచి దిగపోవడానికి ఆయనకు మనస్కరించడం లేదు. ఇందులో భాగంగానే తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా వ్యవహరించి, క్యాపిటల్ భవనంపై దాడికి ఉసిగొల్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గడువుకి ముందే ఆయనను అధ్యక్ష పీఠం నుంచి సాగనంపాలనే నిర్ణయానికి వచ్చారు. అభిశంసన ద్వారా ఆయనను తొలగించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు అభిశంసన తీర్మానం సోమవారం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సెనెట్‌లో రిపబ్లికన్‌‌లు ఆధిపత్యం కొనసాగడం, వారు కూడా మద్దతు ఇవ్వడంతో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉంది. అమెరికా క్యాపిటల్‌ భవనంపై తన మద్దతుదారులను దాడికి ట్రంప్ ప్రోత్సహించారనే అభియోగంతో దిగువ సభలో డెమొక్రాటిక్‌ పార్టీ సభా నేత డేవిడ్‌ సిసిలీన్‌ అభిశంసన తీర్మానాన్ని రాశారు. దీనికి 185 మంది మద్దతు తెలపగా.. బుధవారం ఓటింగ్‌ నిర్వహించునున్నారు. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు.



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ జనవరి 6న క్యాపిటల్‌ భవనంలో సమావేశమైంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున్న ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించి లోనికి చొచ్చుకొచ్చారు. దీంతో పోలీసులు, అందోళనకారులకు జరిగిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొంటున్న రిపబ్లికన్ పార్టీకి చెందిన తొలి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదం పొందితే సెనేట్‌కు పంపుతారు. అక్కడ వాదోపవాదాల తర్వాత తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. అభియోగాలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడికి తన వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. కాగా, కేవలం అధ్యక్ష పీఠం నుంచి గడువుకు ముందు తొలగించడమే కాదు, 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేలా చర్యలు చేపట్టనున్నారు.


బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>