HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpgదాదాపు గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా భావించే వుహన్ నగరంలో నాలుగింట మూడు వంతుల మందికి పైగా కోవిడ్ బారిన పడినట్టు ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. హుబే ప్రావిన్సుల్లోని వుహాన్ నగరంలో తొలిసారిగా 2019, డిసెంబరు నెలలో కరోనా వైరస్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. లాన్జౌ యూనివర్సిటీ, వుహాన్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయన ఫలితాలను గతవారం పీఎల్ఓఎస్ ట్రాపికల్ డిసీజ్ జర్నల్‌లో ప్రచురించారు.corona;koti;2019;university;2020;population;wuhan;coronavirusచైనాలోని వుహాన్ లో మూడు వంతుల జనాభా కోవిడ్ బాధితులేనటచైనాలోని వుహాన్ లో మూడు వంతుల జనాభా కోవిడ్ బాధితులేనటcorona;koti;2019;university;2020;population;wuhan;coronavirusTue, 12 Jan 2021 16:05:00 GMTకరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా భావించే వుహన్ నగరంలో నాలుగింట మూడు వంతుల మందికి పైగా కోవిడ్ బారిన పడినట్టు ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. హుబే ప్రావిన్సుల్లోని వుహాన్ నగరంలో తొలిసారిగా 2019, డిసెంబరు నెలలో కరోనా వైరస్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. లాన్జౌ యూనివర్సిటీ, వుహాన్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయన ఫలితాలను గతవారం పీఎల్ఓఎస్ ట్రాపికల్ డిసీజ్ జర్నల్‌లో ప్రచురించారు.



సెరోప్రివెలెన్స్ స్టడీలో భాగంగా చైనాలోని ఆరోగ్యవంతులైన 63,107 మంది రక్త నమూనాలను సేకరించి, విశ్లేషించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇటువంటి అధ్యయనాలు చాలా ముఖ్యమైనవి.. ఎందుకంటే అవి ఈ ప్రాంతంలో వైరస్ వాస్తవ వ్యాప్తిని అంచనా వేయడంలో సహాయపడతాయి. చికిత్స తీసుకోకుండా కోలుకున్న ఎటువంటి లక్షణాలులేని రోగులను కూడా గుర్తించడానికి ఇవి ఉపకరిస్తాయి. సర్వేలో పాల్గొనవారిని వుహాన్, హుబే ప్రావిన్సులు, చైనాలోని ఇతర రాష్ట్రాలు మూడు సమూహాలుగా ఏర్పాటుచేశారు. వుహాన్ సమూహలోని వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో 1.68 శాతం మందిలో సార్స్-కోవి-2 యాంటీబాడీలు గుర్తించారు. అంటే ప్రతి కోటి మందిలో 1.68 లక్షల మంది కోవిడ్ బారినపడినట్టు నిర్దారణకు వచ్చింది. అయితే, గతేడాది మే వరకు 78,241 మంది వైరస్ బారినపడినట్టు చైనా నివేదించింది. ఇందులో 64.3 శాతం కేసులు (50,340) వుహాన్ నగరంలోనే ఉన్నట్టు తెలిపింది.



‘వుహాన్‌లో 19 మే 2020 నాటికి 50,340 మంది కోవిడ్ బాధితులు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరారు.. అంటే, ఆ నగరంలో మూడింట ఒక వంతు బాధితులు మాత్రమే హాస్పిటల్స్‌లో చికిత్స పొందారు.. మిగతా రెండొంతుల మందిలో ఏ విధమైన లక్షణాలు కనిపించలేదు’ అని అధ్యయనం తెలిపింది. ‘వుహాన్ నగరంలో కోవిడ్ -19 క్లినికల్ కేసులను పక్కనబెడితే SARS-CoV-2 పెద్ద మొత్తంలో అసింప్టిమాటిక్ కేసులు బయటపడ్డాయి.. కాబట్టి, కోవిడ్ లక్షణాలు బయటపడని వ్యక్తులకు కరోనా వైరస్ సోకి ఉండవచ్చు’అని అధ్యయనం నిర్ధారణకు వచ్చింది.


పతనం అవుతున్న బంగారం ,వెండి ధరలు....ఎందుకంటే ....!?

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>