PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/talasani1d765558-532b-48d2-ad7b-9c54ab04f19a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/talasani1d765558-532b-48d2-ad7b-9c54ab04f19a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని మంత్రి తలసాని స్పష్టం చేశారు. పౌల్ట్రీ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రాష్ట్రంలో పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1300 రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేసిన పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.talasani;kcr;srinivas;eatala rajendar;warangal;telangana;mp;district;industries;media;nalgonda;chief minister;industry;minister;chicken;etela rajender;kavuru srinivas;peddapalliబర్డ్ ఫ్లూ... ఊరటనిచ్చే అంశం చెప్పిన తెలంగాణ సర్కార్బర్డ్ ఫ్లూ... ఊరటనిచ్చే అంశం చెప్పిన తెలంగాణ సర్కార్talasani;kcr;srinivas;eatala rajendar;warangal;telangana;mp;district;industries;media;nalgonda;chief minister;industry;minister;chicken;etela rajender;kavuru srinivas;peddapalliTue, 12 Jan 2021 22:13:00 GMTతెలంగాణలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డితో కలసి పౌల్ట్రీ ఇండస్ట్రీ ప్రతినిధులు వివిధ సంస్థల నుండి వచ్చిన సైంటిస్టులు, ప్రొఫెసర్లు, పౌల్ట్రి రంగ నిపుణులు, పశువై ద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బర్డ్ ఫ్లూ పై ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి మంత్రి తలసాని  వివరించారు. పౌల్ట్రీ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు.

పౌల్ట్రీ ఇండస్ట్రీ తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని , ఇతర రాష్ట్రాలు, దేశాలకు పౌల్ట్రీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. చికెన్ , గుడ్లు తినడం వలన ఎటువంటి నష్టం జరగదని , మనకు ప్రోటీన్ లు లభిస్తాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ సోకినట్లు సమాచారం అందిన వేంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1300 రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, క్షేత్ర స్థాయిలలో పశుసంవర్ధక,  ఆరోగ్య , అటవీ శాఖలతో పాటు సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం తో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ, వరంగల్ , పెద్దపల్లి జిల్లాలలో కోళ్లు మృతి చెందినట్లు మీడియా లో వచ్చిన వార్తలకు ప్రభుత్వం వెంటనే స్పందించి 276 శ్యాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేయించగా , నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపారు.

అదే విధంగా గత మూడు రోజులలో 1000 శ్యాంపిల్స్ పరీక్షించగా నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు, శ్యాంపిల్స్ సేకరణ , పరీక్షలపై ప్రజలలో విస్తృత స్తాయిలో ప్రచారం కల్పించి పౌల్ట్రీ పరిశ్రమను కాపాడుటకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. కోవిడ్ -19 ప్రారంభంలో పౌల్ట్రీ ఉత్పత్తులపై పడిన ప్రభావాన్ని నివారించుటకు చేపట్టిన చర్యలతో పౌల్ట్రీ పరిశ్రమ కోలుకుందని తెలిపారు. తెలంగాణకు వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితం అని తెలిపారు. ఈ అంశంపై నీటిపారుదల , అటవీ శాఖ అధికారులతో మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ పై మీడియా లో వస్తున్న కథనాల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించుటలో సహకరించాలని మంత్రి తలసాని మీడియాకు విజ్ఞప్తి చేశారు.



ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>