PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan814cef5f-f4af-422e-a3f3-fe5d35eca26f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan814cef5f-f4af-422e-a3f3-fe5d35eca26f-415x250-IndiaHerald.jpgఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగానే హైలైట్ అవుతున్నారు. గత కొంతకాలంగా పవన్, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. వరుసగా పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే పలువురు మంత్రుల టార్గెట్‌గా విమర్శలు కూడా చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా పవన్‌కు కౌంటర్లు పడుతున్నాయి. pawan kalyan;pawan;chiranjeevi;kumaar;anil music;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;minister;husband;ycp;p anil kumar yadav;janasena party;anil kumar singhal;party;shakti;mantraపవన్‌ తగ్గించుకోవాల్సిందేనా...అనిల్ టార్గెట్ ఏంటి?పవన్‌ తగ్గించుకోవాల్సిందేనా...అనిల్ టార్గెట్ ఏంటి?pawan kalyan;pawan;chiranjeevi;kumaar;anil music;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;minister;husband;ycp;p anil kumar yadav;janasena party;anil kumar singhal;party;shakti;mantraTue, 12 Jan 2021 00:00:00 GMTఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగానే హైలైట్ అవుతున్నారు. గత కొంతకాలంగా పవన్, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. వరుసగా పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే పలువురు మంత్రుల టార్గెట్‌గా విమర్శలు కూడా చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా పవన్‌కు కౌంటర్లు పడుతున్నాయి.

పవన్‌ని కూడా గట్టిగానే టార్గెట్ చేసి ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. ఇలా పవన్-మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం, పవన్ పార్టీ జనసేన గురించి పరోక్షంగా కామెంట్ చేశారు. ఈ మధ్య తోక పార్టీలు లేస్తున్నాయని.. తగ్గించుకుంటే మంచిదని కౌంటర్ వేశారు. అంటే ఇక్కడ జనసేన తోక పార్టీ అనే విధంగా మంత్రి మాట్లాడారు.

గతంలో టీడీపీకి సపోర్ట్‌గా నిలిచి జనసేన తోక పార్టీగా నిలిచింది. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతుంది. అంటే పవన్‌కు స్వతహాగా ఎదిగే శక్తి లేదన్నట్లు మంత్రి ఎద్దేవా చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి మంత్రి అనిల్ పలుమార్లు పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. చిరంజీవి తమ్ముడు కాబట్టే, పవన్‌ని సినిమాల్లో ఆదరించారని కొన్ని సందర్భాల్లో చెప్పారు. అందుకే ఇప్పుడు తోక పార్టీ అని విమర్శించి, కాస్త తగ్గించుకుంటే బాగుంటుందని సెటైర్ వేశారు.

వాస్తవానికి జనసేన కార్యకర్తలు సైతం, ఈ తోక పార్టీ అనే ముద్రని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీని మోసింది వీళ్ళే, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్తితి ఉంది. అసలు ఏపీలో బీజేపీ కంటే జనసేన బలంగా ఉంది. కానీ రివర్స్‌లో బీజేపీ వెనుకే జనసేన వెళుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికలో కూడా బీజేపీనే పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. మరి మంత్రి అనిల్ చెప్పినట్లు జనసేన తోక పార్టీగానే మిగులుతుందో లేదో చూడాలి.




అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>