CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/love-murder55c57aaf-8164-40e7-91f3-dcd3e9a46c5b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/love-murder55c57aaf-8164-40e7-91f3-dcd3e9a46c5b-415x250-IndiaHerald.jpg ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.boy friend killed by girl friend;pavani;prema;ramakrishna;korcha;police;king;love;murder.;kovvur;kukatpally;gharshana;youthకొవ్వూరులో దారుణం..ప్రియుడి క‌త్తితో పొడిచి చంపిన యువ‌తికొవ్వూరులో దారుణం..ప్రియుడి క‌త్తితో పొడిచి చంపిన యువ‌తిboy friend killed by girl friend;pavani;prema;ramakrishna;korcha;police;king;love;murder.;kovvur;kukatpally;gharshana;youthTue, 12 Jan 2021 08:45:36 GMTహత్య చేసిన ఘటన కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాదిగా పావనిపై అనుమానం పెంచుకున్న తాతాజీ పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందింది. సోమవారం సాయంత్రం పావనిని తాతాజీ నాయుడు మాట్లాడాలి పంగిడి రావాలని కోరడంతో వెళ్లింది. అక్కడ ఇద్దరికి ఘర్షణ తలెత్తడంతో తనను ఇంటివద్ద దింపాలని కోరింది. బైక్‌పై మలకపల్లి వెళ్తుండగా వెనుక కూర్చున్న పావని తాతాజీ నాయుడిని ముందుగా ఇంటి నుంచి తెచ్చుకున్న కత్తితో వీపు, తలపైన పొడిచి హత్య చేసింది.


సమాచారం తెలుసుకున్న కొవ్వూరు డీఎస్పీ బి. శ్రీనాథ్‌, రూరల్‌ సీఐ ఎం.సురేష్‌, రూరల్‌ ఎస్‌ఐ కె.రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పావనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.వాస్త‌వానికి కొన్ని సంవ‌త్స‌రాలుగా యువ‌తులు ప్రేమించిన యువ‌కుల‌పై ప్ర‌తీకార దాడుల‌కు పాల్ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తున్నాయి. క్ష‌ణికావేశంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు కొన్న‌యితే ప‌క‌డ్బందీగా ప్ర‌ణాళిక వేసుకుని హ‌త్య‌లు చేసే వారు మ‌రికొంత‌మంది ఉంటున్నారు. గ‌డిచిన ఐదు సంవ‌త్స‌రాల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌లు బాగా పెరిగిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్రేమ నేప‌థ్యంలో హ‌త్య‌లు జ‌ర‌గ‌డం ఇటీవ‌ల ప‌రిపాటిగా మారింది.


ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ప్రియురాలిని హత్య చేసేందుకు వచ్చిన ప్రియుడే హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌కి చెందిన ఒక యువతిని రాజు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆ యువకుడికి ఎన్నిసార్లు చెప్పినా తన ఉన్మాదం వదల్లేదు. ఓ తెల్లవారుఝామున రాజు కొడవలితో తమ ఇంటికి వచ్చి తమ కుమార్తెను చంపడానికి ప్రయత్నించాడని, తామంతా కలిసి రాజును చంపేశామని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపి లొంగిపోయారు.





ఎవరినీ వదిలిపెట్టని కేసీఆర్ ? కారణం ?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>