PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leader-sajjala-ramakirishma-reddy-fire-on-nimmagagga1cc3d12d-653a-4c34-9542-34fcc87dde19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leader-sajjala-ramakirishma-reddy-fire-on-nimmagagga1cc3d12d-653a-4c34-9542-34fcc87dde19-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈలోగా దీనికి సంబంధించి కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి sajjala;kumaar;kranthi;kranti;makar sakranti;andhra pradesh;sankranthi;festival;panchayati;capital;court;letter;tdp;reddy;bhogi;sajjala ramakrishna reddyనాలుగు నెలల్లో విశాఖకు రాజధాని!నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని!sajjala;kumaar;kranthi;kranti;makar sakranti;andhra pradesh;sankranthi;festival;panchayati;capital;court;letter;tdp;reddy;bhogi;sajjala ramakrishna reddyTue, 12 Jan 2021 21:56:54 GMTఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పండుగ. సంక్రాంతి పండుగలో భోగి మంటలు స్పెషల్. అందుకే ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసి కుటుంబమంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. కాని ప్రస్తుతం ఏపీలో భోగి మంటలతో పాటు రాజకీయ మంటలు సెగలు రేపుతున్నాయి.
పండగ సమయంలోనూ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.  ఈలోగా దీనికి సంబంధించి కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి 

       పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కారణం వల్లే ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జీవీ సాయిప్రసాద్ ను, ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ ను నిమ్మగడ్డ రమేశ్ తొలగించడంపై స్పందిస్తూ... ఉద్యోగులను బెదిరించేలా ఈ చర్యలు ఉన్నాయని సజ్జల మండిపడ్డారు.  

      ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాజ్యాంగ బాధ్యత ఉన్న వ్యక్తిగా నిమ్మగడ్డ వ్యవహరించడం లేదని విమర్శించారు. నిమ్మగడ్డ ప్రతి అడుగు టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని చెప్పారు.నిమ్మగడ్డను అడ్డుపెట్టుకని చంద్రబాబు చేసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు సజ్జల. దేశమంతా కోవిడ్ వ్యాక్సినేషన్ పనిలో ఉంటే చంద్రబాబు మాత్రం ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. 


వామ్మో ....ఆదాశర్మ బీచ్ లో ఎం చేసిందో తెలుసా .

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>