PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawancebcf537-548e-4623-a178-3c786d9d840a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawancebcf537-548e-4623-a178-3c786d9d840a-415x250-IndiaHerald.jpgరాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేద్దామని చూసినా, జనసేన పార్టీకి బలం లేకపోవడంతో టిడిపి ,బిజెపి కూటమికి మద్దతు ఇచ్చారు. అంతేకాదు 2019 వరకు ఆ పార్టీలతో సన్నిహితంగానే పవన్ మెలిగారు . కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా అంటే పెద్దగా ఏపీలో బలం లేని వామపక్ష పార్టీలు, బి ఎస్ పి పార్టీతోనూ పవన్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా పవన్ కు నిరాశే ఎదురైంది. కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాjanasena ap bjp pavan kalyan;auto;pawan;kalyan;bharatiya janata party;janasena;2019;letter;tdp;janasena partyపవన్ ముందు చూపు రాజకీయం ! వర్కౌట్ అయ్యేనా ?పవన్ ముందు చూపు రాజకీయం ! వర్కౌట్ అయ్యేనా ?janasena ap bjp pavan kalyan;auto;pawan;kalyan;bharatiya janata party;janasena;2019;letter;tdp;janasena partyTue, 12 Jan 2021 05:00:00 GMTరాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేద్దామని చూసినా, జనసేన పార్టీకి  బలం లేకపోవడంతో టిడిపి ,బిజెపి కూటమికి మద్దతు ఇచ్చారు. అంతేకాదు 2019 వరకు ఆ పార్టీలతో సన్నిహితంగానే పవన్ మెలిగారు . కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా అంటే పెద్దగా ఏపీలో బలం లేని వామపక్ష పార్టీలు, బి ఎస్ పి పార్టీతోనూ పవన్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా పవన్ కు  నిరాశే ఎదురైంది. 



కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే పవన్ మాత్రం ఎక్కడా నిరాశ చెందకుండా రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 తన ఆశ తీర్చక పోయినా, 2022 లో జమిలి ఎన్నికలు వస్తే తన ఆశ నెరవేరుతుంది అనే అభిప్రాయంలో ఉన్నారు. అది సాధ్యం కాకపోతే 2024 కి అయినా, తనకు అధికారం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పవన్ పెడుతున్న మీటింగులకు పెద్ద ఎత్తున యువత హాజరవుతున్నారు. వారిలో ఓటుహక్కు ఉన్నవారు చాలా తక్కువ మందే. వారే రాబోయే రోజుల్లో తమ పార్టీకి ఓటు వేసే కీలకమైన వ్యక్తి అని పవన్ గుర్తించారు.




 వారి అండదండలతో అధికారంలోకి సులభంగా రావొచ్చనే ధీమాగా ఉన్నారు. మెజారిటీ ప్రజలకు  పవన్ పై ఉన్న అభిప్రాయం ఏమిటనేది తెలియదు. కేవలం అభిమానుల అండదండలు,  ఒక సామాజిక వర్గం లోని కొంత మంది ఓటర్లను నమ్ముకుని రాజకీయం చేస్తే అది వర్కవుట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. గతంలో ఈ తరహా అనుభవం కూడా ఉంది. ప్రజారాజ్యం అనుభవం  నుంచి పవన్ నేర్చుకోవాల్సిందే. కానీ పవన్ మాత్రం తన అభిమానుల మీదే ఆశలు పెట్టుకున్నాడు వారే తన ఆశయాన్ని  తీర్చగలరు అని నమ్ముతున్నారు. వారే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.



హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>