PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-in-dilemma-in-ntr-gruhakalpa-houses46e56b31-8790-410d-a24b-4422782cd113-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-in-dilemma-in-ntr-gruhakalpa-houses46e56b31-8790-410d-a24b-4422782cd113-415x250-IndiaHerald.jpg రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డం, దీనిని వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డం.. హైకోర్టుకు వెళ్ల‌డం, ప్ర‌భుత్వ వాద‌న బ‌ల‌ప‌డ‌డం తెలిసిందే. అంటే.. మొత్తంగా ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వ వాద‌న‌ను హైకోర్టు బ‌ల‌ప‌రిచింది. దీంతో ఇప్పుడు వైసీపీలో స‌హ‌జంగానే సంబ‌రాల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. కార‌ణాలు ఏవైనా.. కూడా ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై ప్ర‌భుత్వం పైచేయి సాధించింది. అయితే.. ఇప్పుడు ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ఎలా రియాక్ట్ కావాలి? అనేది కీల‌క chandra babu;kumaar;adinarayanareddy;high court;letter;tdp;local languageబాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !chandra babu;kumaar;adinarayanareddy;high court;letter;tdp;local languageTue, 12 Jan 2021 13:22:00 GMTస్థానిక ఎన్నిక‌ల‌పై హైకోర్టు ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం వెలువ‌రించిన తీర్పు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని సంక‌టంలోకి నెట్టేసింది. ఆది నుంచి ఎన్నిక‌ల‌ను స‌పోర్టు చేస్తూ.. వ‌చ్చిన టీడీపీ.. గ‌త ఏడాది మార్చిలో ఎన్నిక‌ల‌ను క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేయ‌డాన్ని స‌మ‌ర్ధించింది. అదేస‌మ‌యంలో దీనిని రాజ‌కీయంగా మార్చుకుని.. జ‌గ‌న్ స‌ర్కారుపై కామెంట్లతో విరుచుకుప‌డింది. మొత్తంగా గ‌త ఏడాది స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో రాజ‌కీయంగా టీడీపీకి మంచి ల‌బ్ధి చేకూరింది. ప్ర‌భుత్వంపై ఒక ర‌కంగా పైచేయి కూడా సాధించింది. అప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఉన్న నైరాశ్యం కూడా ప‌టాపంచ‌లైంద‌న‌డంలో సందేహం లేదు. అప్ప‌ట్లో ఎన్నిక‌లు ఎలా పెడ‌తారంటూ.. ప్ర‌శ్నించి ప్ర‌జ‌ల్లోనూ మంచి మార్కులు కొట్టేసింది.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డం, దీనిని వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డం.. హైకోర్టుకు వెళ్ల‌డం, ప్ర‌భుత్వ వాద‌న బ‌ల‌ప‌డ‌డం తెలిసిందే. అంటే.. మొత్తంగా ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వ వాద‌న‌ను హైకోర్టు బ‌ల‌ప‌రిచింది. దీంతో ఇప్పుడు వైసీపీలో స‌హ‌జంగానే సంబ‌రాల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. కార‌ణాలు ఏవైనా.. కూడా ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై ప్ర‌భుత్వం పైచేయి సాధించింది.

అయితే.. ఇప్పుడు ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ఎలా రియాక్ట్ కావాలి? అనేది కీల‌క అంశంగా మారింది. ఎటు మాట్లాడినా.. రాజ‌కీయంగా టీడీపీకి ఎదురు ప్ర‌శ్న‌లు వ‌స్తాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో ఎన్నిక‌ల వాయిదా నిర్ణ‌యం తీసుకున్న ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించి.. ప్ర‌భుత్వంపై ఎదురు దాడి చేసిన ‌ట్టే.. ఇప్పుడు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న‌.. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించే సాహ‌సం చేస్తే.. టీడీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బాబు నిమ్మ‌గ‌డ్డ‌తో కలిసి ప్లే చేయాల‌నుకున్న డ్రామాలో టీడీపీయే చివ‌ర‌కు బుక్ అయ్యింది.

ఎందుకంటే.. ప్రభుత్వం వైపు నుంచి ఎన్నిక‌ల‌ను అడ్డుకునేందుకు చూపించిన కార‌ణాలు చాలా స‌హేతుకంగా ఉన్నాయ‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప్ర‌జారోగ్యాన్ని ఆనాడు చూపించి ఎన్నిక‌లు వాయి దా వేసిన ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యాన్ని అప్ప‌ట్లో మెజారిటీ ప్ర‌జ‌లు హ‌ర్షించారు. ఇప్పుడు ఇదే కార‌ణంతో వాయిదా వేయాల‌న్న ప్ర‌భుత్వ వాద‌న‌కు కూడా అంతే మద్ద‌తు ల‌భిస్తోంది. సో.. ఇప్పుడు దీనిని కాద‌ని టీడీపీ యాగీ చేస్తే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>