PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine6bcc8baf-7ae0-499b-b6e6-8fa5e8e7892c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine6bcc8baf-7ae0-499b-b6e6-8fa5e8e7892c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 16న ప్రారంభించనున్న మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కలెక్టర్లు,ఎస్పిలను ఆదేశించారు. విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ముందుగా సుమారు 3లక్షల 80వేల మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్ లు ఇవ్వనున్నట్టు చెప్పారు.corona vaccine;kumaar;anil music;bhaskar;vijayakumar;godavari river;krishna river;vijayawada;andhra pradesh;district;baba bhaskar;collector;krishna district;traffic police;anil kumar singhal;madhavilata;reddy;jandhyala ravishankar16 నుంచి ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు16 నుంచి ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లుcorona vaccine;kumaar;anil music;bhaskar;vijayakumar;godavari river;krishna river;vijayawada;andhra pradesh;district;baba bhaskar;collector;krishna district;traffic police;anil kumar singhal;madhavilata;reddy;jandhyala ravishankarTue, 12 Jan 2021 22:13:24 GMTఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 16న ప్రారంభించనున్న మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన  చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కలెక్టర్లు,ఎస్పిలను ఆదేశించారు. విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన  కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ముందుగా సుమారు 3లక్షల 80వేల మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్ లు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 332 సెషన్ సైట్లలో వ్యాక్సిన్ లు ఇవ్వనున్నమని ఆయన పేర్కొన్నారు. ఇందుకుగాను ఇప్పటికే రాష్ట్రానికి 4లక్షల 77వేల డోసుల వ్యాక్సిన్లు  చేరాయని తెలిపారు. 16న జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణీలు, 50యేళ్ళు నిండిన వారికి, 18యేళ్ళు లోపు వారికి, కోమార్భీడిటీ లక్షణాలతో ఇబ్బందిపడేవారికి ఇంజెక్షన్లు వేయరాదని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా తగిన పటిష్ట చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
                                           డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ అందరు ఎస్పి లు జిల్లా కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ఈ కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు. రెండవ విడతలో పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయనున్నందున పోలీస్ బందోబస్తు ఏర్పాట్లకు ఆటంకం లేకుండా అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఈనెల 16న ప్రారంభం కానున్న తొలి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాష్ట్రంలో 332 సెషన్ సైట్లను ఏర్పాటు చేయగా వాటిలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 33 సైట్లు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 15 సైట్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నాలలో ఒక్కోక్క సైట్ ను పూలే కమ్యునికేషన్ నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 4లక్షల 77వేల కోవిషీల్డు వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యాయని తెలిపారు.
                                      వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా వ్యాక్సిన్ స్టోరేజి కేంద్రాలను సిసిటివిల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని వివరించారు. ప్రతి గ్రామ/వార్డు సచివాలయం వద్ద ఒక సెషన్ సైట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో చేయవలసిన చేయి గూడని అంశాలపై ఐఇసి మెటీరియల్ ను జిల్లాలకు పంపామని చెప్పారు. ఈ వీడియో సమావేశంలో అదనపు డిజిపి రవిశంకర్, సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జెసి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.


ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>