BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/frute-pebeauteal-74a85e33-2497-4887-ad89-2629ad0debc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/frute-pebeauteal-74a85e33-2497-4887-ad89-2629ad0debc7-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ఏ పండునైనా తినాలి అంటే ముందుగా తొక్కతీసి ఆ పండుని తింటూ ఉంటాము. మనలో చాలామంది కేవలం పండు లో మాత్రమే పోషకాలు ఉంటాయి తొక్కలో ఉండవనే అపోహతో తొక్కను పడేస్తుంటారు. కానీ పండ్ల లోనే కాదు, పండ్ల తొక్కలలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల తొక్కలు మన చర్మంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా ఎన్నో అద్భుతాలను కలిగిస్తాయని, వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాల తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. అందుకే పండును మాత్రమే తిని తొక్కను విసిరేస్తుంటారు. అయితే frute,pebeauteal,;nainaపండ్ల తొక్కలను పడేస్తున్నారా? కాసేపు ఆగండి.పండ్ల తొక్కలను పడేస్తున్నారా? కాసేపు ఆగండి.frute,pebeauteal,;nainaTue, 12 Jan 2021 13:25:00 GMTసాధారణంగా మనం ఏ పండునైనా తినాలి అంటే ముందుగా తొక్కతీసి ఆ పండుని తింటూ ఉంటాము. మనలో చాలామంది  కేవలం పండు లో మాత్రమే పోషకాలు ఉంటాయి తొక్కలో ఉండవనే అపోహతో తొక్కను పడేస్తుంటారు. కానీ పండ్ల లోనే కాదు, పండ్ల తొక్కలలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల తొక్కలు మన చర్మంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా ఎన్నో అద్భుతాలను కలిగిస్తాయని, వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాల తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. అందుకే పండును మాత్రమే తిని తొక్కను విసిరేస్తుంటారు. అయితే ఆ తొక్కల  వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కాస్మెటిక్స్, క్రీమ్స్ తయారీసంస్థలు సృబ్స్,క్రీమ్స్  తయారు చేసేటప్పుడు ఎక్కువగా పళ్ళ తొక్కలను ఉపయోగిస్తున్నారు.  ఇందులో ముఖ్యంగా నారింజ పండు తొక్కలో సహజ స్క్రబ్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ పండు తొక్కలను స్క్రబ్ రూపంలో వాడడం వల్ల చర్మానికి విశ్రాంతి కలగడమే కాకుండా చర్మంపై ఉన్న మృతకణాలు కూడా తొలగిపోతాయి. ఫలితంగా కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.


ఇందుకోసం 10 నుంచి 20 గ్రాముల ఎండబెట్టిన నిమ్మ లేదా నారింజ తొక్కను తీసుకోండి. ఈ తొక్కలను మెత్తగా రుబ్బుకొని,అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను కలపండి.  ఈ పొడిలో కొద్దిగా పాలు, పెరుగు లేదా తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై  అప్లై చేసి స్క్రబ్  లాగా చేయాలి.  పది నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడుక్కుంటే సరిపోతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా తయారవుతుంది.

అరటి తొక్కలో కూడా  అధికంగా కొవ్వు ఆమ్లాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తాయి.  ఇందుకోసం అరటి తొక్కను తీసుకొని,దానిని ముఖంపైన వృత్తాకారంలో రుద్దుతూ, అరటి తొక్క  గోధుమరంగులోకి వచ్చేవరకు మర్దనా  చేయాలి. అరగంట ఆగి, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా ముఖం మీద నల్లమచ్చలు, ముడతలు తగ్గిపోయే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా తామర,సోరియాసిస్ వంటి దుర్బలత్వం ఉన్నవారు ఈ పద్ధతిని అనుసరించవచ్చు.




బ్రహ్మానందం గారితో గొడవ పడడానికి గల కారణాలు చెప్పిన...?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!

త్రివిక్రమ్ మీద బన్నీ ఫ్యాన్స్ ఫైర్...

సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు

ప‌రిటాల శ్రీరామ్‌కు చంద్ర‌బాబు, లోకేష్ కంబైన్డ్ షాక్‌... దెబ్బ‌కొట్టారే..!

బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>