MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunita71b44d50-39e4-4499-b507-38988703bfae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunita71b44d50-39e4-4499-b507-38988703bfae-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్న విషయాల్లో సింగర్ సునీత పెళ్లి కూడా ఒకటి. మామూలుగానే సెలెబ్రిటీల పెళ్లి అంటే క్రేజ్ ఓ రేంజ్‌ లో ఉంటుంది. పెళ్లి ముందు వారికి జరిగే మెహిందీ ఫంక్షన్లు, ఆ తరువాత జరిగే రిసెప్షన్ వేడుకలపై కూడా ఫ్యాన్స్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.sunita;jeevitha rajaseskhar;ram pothineni;suma;suma kanakala;marriage;heaven;murder.;santoshamహనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..sunita;jeevitha rajaseskhar;ram pothineni;suma;suma kanakala;marriage;heaven;murder.;santoshamTue, 12 Jan 2021 23:36:25 GMTపెళ్లి కూడా ఒకటి. మామూలుగానే సెలెబ్రిటీల పెళ్లి అంటే క్రేజ్ ఓ రేంజ్‌ లో ఉంటుంది. పెళ్లి ముందు వారికి జరిగే మెహిందీ ఫంక్షన్లు, ఆ తరువాత జరిగే రిసెప్షన్ వేడుకలపై కూడా ఫ్యాన్స్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఇక పెళ్లి తరువాత వాళ్లు హనీమూన్‌కు ఎక్కడికి వెళ్తారనే దానిపై కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత, రామ్ వీరపనేని.. కూడా వాళ్ల హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు? అనే ప్రశ్న ఫ్యాన్స్ ను వేధిస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ విషయంపై సింగర్ సునీత స్పందించింది. కరోనా వల్ల పెళ్లికి, ఇతర వేడుకలకు బంధువులను, అభిమానులను అందర్నీ పిలవడం కుదరలేదని ఆమె చెప్పారు. అప్పటికీ పెళ్లికి 200 మంది వరకూ అతిథులు హాజరైనట్లు వివరించింది.

ఇక రిసెప్షన్ లాంటి భారీ కార్యక్రమం ఏదీ ప్లాన్ చేయడం లేదని చెప్పిన ఆమె.. సన్నిహితులకు మాత్రం చిన్న చిన్న పార్టీలు ఇస్తామని తెలియ జేసింది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాతే హనీమూన్ ప్లాన్ చేసుకుంటామని క్లారిటీగా చెప్పేసింది. హనీమూన్‌తో పాటు రామ్ వీరపనేనితో పరిచయం, పెళ్లి అంశంపై సునీత చాలా విషయాలు బయట పెట్టింది. తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చిన సునీత.. కొత్త జీవితం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఆమె హనీమూన్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. పెళ్లి చేసుకొని రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సునీతకు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. యాంకర్ సుమ కూడా వధూవరులను అభినందించి ఓ వజ్రాల నెక్లెస్ ను కానుకగా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన వివాహం విషయం చాలా సంతోషంగా ఉన్నానని, మున్ముందు జీవితంపై ఎంతో ఎగ్జయిట్ అవుతున్నానని సునీత చెప్పారు.


నిమ్మగడ్డ కథలో ట్విస్ట్....జగన్ భారీ క్లైమాక్స్ రెడీ చేశారా?

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో.. మన ర్యాంక్ ఎంతో చెప్పిన జాబితా.. అగ్రస్థానం మళ్లీ వాళ్లకే!

త్రివిక్రమ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో.. ఏమని చెప్పాడంటే

‘మాస్టర్’ లీక్ చేసిందెవరో తెలిసిపోయింది.. ఎవరో తెలుసా?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>