PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu7bcdd100-d6a9-4ac0-9155-d426ce0f4be7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu7bcdd100-d6a9-4ac0-9155-d426ce0f4be7-415x250-IndiaHerald.jpgయువత భవిష్యత్తుపై వైసీపీ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటోన్న యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశ సొంతం అన్నారు.chandrababu naidu;jayanthi;jagan;telugu;tdp;ycp;shakti;jayamరాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతదే: చంద్రబాబు నాయుడురాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతదే: చంద్రబాబు నాయుడుchandrababu naidu;jayanthi;jagan;telugu;tdp;ycp;shakti;jayamTue, 12 Jan 2021 13:26:25 GMTవైసీపీ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటోన్న యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశ సొంతం అన్నారు. అపారమైన మేథస్సు, శక్తి సామర్థ్యాలు కలిగిన మన యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నైపుణ్యాల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు.
                                  ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి ద్వారా దేశవిదేశాల్లో తెలుగుయువత ప్రతిభకు స్థానం లభించేలా చేశామని చెప్పారు. నవ్యాంధ్రలో ఐదేళ్ల‌లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులతో 30లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశామని చంద్రబాబు వివరించారు. ఆ కష్ట ఫలితంగా దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామని, 10లక్షల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.

                             19నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు అన్నింటినీ జగన్ ప్రభుత్వం తరిమేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు.  యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారని, యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారంటూ చంద్రబాబు ఆవేదన చెందారు.

                         ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీ కాళ్లపై మీరు నిలబడటమే కాకుండా, సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత భుజాన వేసుకోవాలని సూచించారు. పాలకుల దుశ్చర్యలపై అన్నివర్గాల ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
'వివేకానందుడి మార్గదర్శకంలో హింసా విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలు లేని సమాజాన్ని ఆవిష్కరించాల్సింది యువతరమే. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతగా మీరంతా రూపొందాలి. అన్ని రంగాల్లో మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందంజ వేయించాలి' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు.


ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>