CrimeChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/love-murder7d0b18e1-f486-4608-be80-c17b6d500011-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/love-murder7d0b18e1-f486-4608-be80-c17b6d500011-415x250-IndiaHerald.jpgప్రేమ ఇది ఓ మైకం.. ప్రేమ ఇది ఓ పిచ్చి.. ప్రేమ ఇది శక్తి.. ఇలా ప్రేమ రూపాలు అనంతం.. మనిషిని ఇంతగా ప్రభావితం చేసే ఎమోషన్ ఇంకొకటి లేదు.. అందుకే ప్రేమ కోసం కొందరు రుషులవుతారు.. ప్రేమ కోసం కొందరు విజేతలవుతారు.. మరికొందరు అదే ప్రేమ కోసం పిచ్చివాళ్లవుతారు.. ఇంకొందరు ఏకంగా హంతకులు అవుతారు.. మనుషులతో ఎంతటి పనైనా చేయించే శక్తి ఉన్న బలమైన ఎమోషన్ ప్రేమ. అయితే ప్రేమ వల్ల బాగుపడిన వాళ్ల సంగతేమో కానీ.. కొందరు ఏకంగా నేరాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయిని ప్రేమ కారణంగా ఏకంగా హంతకురాలైంది.. తాను పిచ్చిగlove-murder;manu;pavani;prema;tara;godavari river;korcha;district;west godavari;police;marriage;love;girl;murder.;shakti;katthiవామ్మో.. పెళ్లికి ఒప్పుకోలేదని.. నడిరోడ్డుపై కసాకసా పొడిచి చంపేసింది..!?వామ్మో.. పెళ్లికి ఒప్పుకోలేదని.. నడిరోడ్డుపై కసాకసా పొడిచి చంపేసింది..!?love-murder;manu;pavani;prema;tara;godavari river;korcha;district;west godavari;police;marriage;love;girl;murder.;shakti;katthiTue, 12 Jan 2021 08:40:10 GMTప్రేమ ఇది ఓ మైకం.. ప్రేమ ఇది ఓ పిచ్చి.. ప్రేమ ఇది శక్తి.. ఇలా ప్రేమ రూపాలు అనంతం.. మనిషిని ఇంతగా ప్రభావితం చేసే ఎమోషన్ ఇంకొకటి లేదు.. అందుకే ప్రేమ కోసం కొందరు రుషులవుతారు.. ప్రేమ కోసం కొందరు విజేతలవుతారు.. మరికొందరు అదే ప్రేమ కోసం పిచ్చివాళ్లవుతారు.. ఇంకొందరు ఏకంగా హంతకులు అవుతారు.. మనుషులతో ఎంతటి పనైనా చేయించే శక్తి ఉన్న బలమైన ఎమోషన్ ప్రేమ. అయితే ప్రేమ వల్ల బాగుపడిన వాళ్ల సంగతేమో కానీ.. కొందరు ఏకంగా నేరాల్లో చిక్కుకుంటున్నారు.

తాజాగా ఓ అమ్మాయిని ప్రేమ కారణంగా ఏకంగా హంతకురాలైంది.. తాను పిచ్చిగా ప్రేమించే అబ్బాయి.. తనకు శాశ్వతంగా దక్కడన్న కోపంతో ఓ యువతి అతడినే దారుణంగా నడిరోడ్డుపై పొడిచి చంపేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు  రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమను అబ్బాయి టైంపాస్‌గా తీసుకున్నాడు. కానీ అమ్మాయి ప్రేమే లోకం అనేంతగా డీప్‌ లవ్‌లోకి  వెళ్లిపోయింది.

అందుకే ఆ ప్రేమను శాశ్వతం చేసుకోవాలని అతడిని పెళ్లి చేసుకోమని అడుగుతోంది. ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ మాత్రం ఏదో ఓ సాకు చెప్పి నో చెబుతూ వస్తున్నాడు.  సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్లింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఎంతగా అడిగినా పెళ్లిపై క్లారిటీ రాలేదు పావనికి పైగా.. తాతాజీ ఇంకా ఎవరినో ప్రేమిస్తున్నాడని అనుమానం వచ్చింది. అంతే.. తనకు తాతాజీ దక్కడేమో అని భయపడింది. ఇక తనకు దక్కడేమో అన్న అనుమానం ఆమె తట్టుకోలేకపోయింది.  

రాత్రి ఆమెను దింపడానికి తాతాజీ మలకపల్లి వెళ్తుండగా బండిపై వెనుక కూర్చుని ఉన్న పావని బ్యాగులోని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపైనా పొడిచింది. తీవ్ర రక్తగాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళుతున్న వారు ఆ సీన్ చూసి అవాక్కయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>