MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-career-plan98dc89b6-37c2-4e2d-8dee-8f101ccefd46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-career-plan98dc89b6-37c2-4e2d-8dee-8f101ccefd46-415x250-IndiaHerald.jpgఈ విధంగా చూసుకుంటే భవిష్యత్తులో మరింతమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మహేష్ పల్స్ తెలుసుకున్న నూతన దర్శకులు ఎలాగైనా తనతో సినిమా చేయాలని కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక శుభపరిణామమని చెప్పవచ్చు.mahesh babu career plan;mahesh;venkatesh;govinda;anil music;anil ravipudi;geetha;govi;kudumu;tollywood;cinema;rajani kanth;geetha govindam;gita govindam;industry;director;hero;march;research and analysis wingకొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తున్న సూపర్ స్టార్...!కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తున్న సూపర్ స్టార్...!mahesh babu career plan;mahesh;venkatesh;govinda;anil music;anil ravipudi;geetha;govi;kudumu;tollywood;cinema;rajani kanth;geetha govindam;gita govindam;industry;director;hero;march;research and analysis wingTue, 12 Jan 2021 13:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ఇప్పుడు కొత్త ఆలోచనలతో తన సినీ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇంతకు ముందు వరకు తాను చేసిన దర్శకులతోనే సినిమాలను చేసేవారు. అప్పుడే తన గురించి వారికి పూర్తిగా తెలుసు కాబట్టి, తనకు నచ్చిన విధంగా కథలను ఎంచుకుంటారని అనుకునే వాడు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టారు. దర్శకులను ఎంచుకునే విషయంలో పూర్తిగా తన రూటు మార్చి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా మారాలన్నా ఈ నిర్ణయం తనకు మంచి విజయాలను అందిస్తుందని నమ్ముతున్నారు. ఆ రూట్లోనే ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.

ఇప్పుడు టాలెంట్ ఉన్న నూతన దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తూ కెరీర్ లో కొత్త మెరుపులు కోసం న్యూ ట్రాక్ సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు చాలా కొత్తగా కథలను తెరకెక్కించే తీరు మహేష్ ని బాగా ఆకట్టుకుందట. దీనికి నిదర్శనంగా మనము చాలా సినిమాలను చూశాము.  ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ గా మారిపోయిందంటే నమ్మండి.  ఎంతో మంది స్టార్ హీరోలు సైతం నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ సాలిడ్ హిట్ లను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే బాట పట్టారు హీరో మహేష్...ఈ ప్రణాళికను అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ప్రారంభమైందని చెప్పొచ్చు. దీని తరువాత గీత గోవిందంతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ పరుశురాం కి అవకాశం ఇచ్చాడు.

ఇప్పుడు ఇతని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా ఇదే. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న రూమర్ల ప్రకారం తాను నెక్స్ట్ చేయబోయే సినిమా వెంకీ కుడుములతో  చేయనున్నారని తెలిసింది. ఈ విధంగా చూసుకుంటే భవిష్యత్తులో మరింతమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మహేష్ పల్స్ తెలుసుకున్న నూతన దర్శకులు ఎలాగైనా తనతో సినిమా చేయాలని కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక శుభపరిణామమని చెప్పవచ్చు.


ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>