PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnap-case-lo-jagath-vikhyath-reddy-handda81a0cc-1a91-461c-899a-af64d8eaf01f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnap-case-lo-jagath-vikhyath-reddy-handda81a0cc-1a91-461c-899a-af64d8eaf01f-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్ కేసు రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్ అలాగే ఆయన అనుచరుడు గుంటూరు శ్రీను కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నట్లు చెబుతున్నారు. అంతే కాదు ఈ కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్ ప్రణాళిక అంతా అమలు చేయడానికి ముందachhennaidu;amala akkineni;ram pothineni;tiru;varsha;police;bhuma akhila priya;driver;husband;police station;arrest;traffic police;reddy;pettaకిడ్నాప్ కేసులో విఖ్యాత్ రెడ్డి హ్యాండ్.. అరెస్ట్ తప్పదా ?కిడ్నాప్ కేసులో విఖ్యాత్ రెడ్డి హ్యాండ్.. అరెస్ట్ తప్పదా ?achhennaidu;amala akkineni;ram pothineni;tiru;varsha;police;bhuma akhila priya;driver;husband;police station;arrest;traffic police;reddy;pettaTue, 12 Jan 2021 16:00:00 GMTబోయినపల్లి కిడ్నాప్ కేసు రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్ అలాగే ఆయన అనుచరుడు గుంటూరు శ్రీను కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నట్లు చెబుతున్నారు. అంతే కాదు ఈ కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్ ప్రణాళిక అంతా అమలు చేయడానికి ముందే జగత్ విఖ్యాత్ రెడ్డి కిడ్నాపర్లతో మాట్లాడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే అఖిల ప్రియను అరెస్టు చేసే సమయంలోనే పోలీసులు జగత్ విఖ్యాత్ రెడ్డిని కూడా విచారించారు.అయితే ఆ సమయంలో అతని నుంచి వివరాలు సేకరించి పోలీసులు వదిలేశారు. అయితే ఇప్పుడు అతని డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని మరోసారి విచారించే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో అతని ప్రమేయం ఉందని తేలితే అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరో పక్క బేగం పేట మహిళా పోలీస్ స్టేషన్ లో అఖిలప్రియ విచారణ ప్రారంభమైంది.

మూడు రోజుల కస్టడీలో భాగంగా ఈరోజు రెండో రోజు పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి అఖిలప్రియ మీద పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే మహిళా సిబ్బంది సమక్షంలో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు అని అంటున్నారు. ఇక జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా అరెస్టు అయితే ఈ కేసు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


రెడ్డీస్ అమ్మయిలను పెళ్లి చేసుకున్న హీరోలు వెళ్లే.. !!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>