Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cinnamon-health-benefits470cc94f-357c-4573-bf9d-bc724bd4aa74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cinnamon-health-benefits470cc94f-357c-4573-bf9d-bc724bd4aa74-415x250-IndiaHerald.jpgసుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ముఖ్యమైనది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.దీన్ని మసాలా కూరలు, బిర్యాని తయారు చేయడంలో వేస్తారు.దాల్చిన చెక్క వేయడం వల్ల బిర్యాని, కూరలు రుచిగా ఉంటాయని మాత్రమే మనకి తెలుసు, కానీ దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఔషధ గుణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..cinnamon,health, benefits;tara;heart;cancer;sugar;oil;cumin;aqua;pomegranate;cinnamon;masalaదాల్చిన చెక్క ఔషధగుణాల పుట్ట.. అవి ఏంటంటే..?దాల్చిన చెక్క ఔషధగుణాల పుట్ట.. అవి ఏంటంటే..?cinnamon,health, benefits;tara;heart;cancer;sugar;oil;cumin;aqua;pomegranate;cinnamon;masalaTue, 12 Jan 2021 02:30:00 GMTదాల్చిన చెక్క ముఖ్యమైనది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.దీన్ని మసాలా కూరలు, బిర్యాని తయారు చేయడంలో వేస్తారు.దాల్చిన చెక్క వేయడం వల్ల బిర్యాని, కూరలు రుచిగా ఉంటాయని మాత్రమే మనకి తెలుసు, కానీ దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఔషధ గుణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

 దాల్చిన చెక్క తో టీ చేసుకొని తాగడం వల్ల షుగర్, క్యాన్సర్,గుండె జబ్బులు వంటి సమస్యలను దూరం చేయవచ్చు. ఎందుకంటే దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు,పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపుతుంది.

మొటిమలు ఉన్నవాళ్లు దాల్చిన చెక్క పొడిని, నిమ్మరసాన్ని పెద్దగా కలిపి మొటిమలపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.

 బరువు తగ్గాలనుకునేవారు అర స్పూన్ దాల్చినచెక్క పొడి, గ్యాస్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి. తర్వాత వడగట్టి తేనె కలుపుకొని తాగడం వల్ల బరువు తగ్గుతారు.

దాల్చిన చెక్క పొడి, శొంఠిపొడి,జీలకర్ర పొడి, మూడింటికి సమాన భాగాలుగా కలిపి అర టీ స్పూన్ మోతాదులో తేనెతో కలిపి రెండుపూటలా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి, విరేచనాలు తగ్గుతాయి.

 రక్తహీనత ఉన్న వాళ్లు రక్తం పెరగడానికి,పావు చెంచాడు కాల్చిన చెక్క పౌడరు,అర కప్పు దానిమ్మ రసం అరచెంచాడు తేనె కలిపి తీసుకోవడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది.

 దాల్చిన చెక్క, మిరియాలు సమానంగా తీసుకొని నూరి కషాయం చేసుకుని తాగడం వల్ల జలుబు తగ్గుతుంది.

మంచి నిద్ర పట్టాలంటే అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని,కప్పుల నీళ్ళు పోసి ఐదు నిమిషాలు వేడిచేసి ఇందులో తేనె కలుపుకొని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

 దాల్చిన చెక్క నూనె లో దూది ముంచి నొప్పి ఉన్న పంటి మీద పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది.

దాల్చిన చెక్క పొడి, యాలక్కాయలపొడి,శొంఠి పొడి మూడింటిని సమానంగా తీసుకొని,భోజనానికి ముందు ఉదయం సాయంత్రం తీసుకుంటే ప్రక్రియ సక్రమంగా జరిగి మలబద్దక సమస్య ఉండదు.

 వాంతులు తగ్గడానికి పది గ్రాముల దాల్చిన చెక్క,5 గ్రాములు లవంగాలు నీళ్లతో కషాయం చేసుకుని తాగితే వాంతులు తగ్గుతాయి.

 దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి చర్మ వ్యాధులు,దురద వంటి వాటిపై పూయడం వల్ల చర్మ వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.


ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>