HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpgజనవరి 16 నుంచి ప్రారంభం కానునున్న తొలి వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమంలో 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకయ్యే ఖర్చునంతా కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధాని మోదీ తెలిపారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు కరోనా వ్యాక్సిన్ అందిస్తామని మోదీ వెల్లడించారు. వీరిలో ప్రజా ప్రతినిధులు ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. modi;narendra modi;telugu;january;cm;prime minister;central government;lie;coronavirus;narendraతొలి దశలో ఇవ్వనున్న వ్యాక్సిన్ పూర్తిగా ఉచితం - ప్రధాని మోదీతొలి దశలో ఇవ్వనున్న వ్యాక్సిన్ పూర్తిగా ఉచితం - ప్రధాని మోదీmodi;narendra modi;telugu;january;cm;prime minister;central government;lie;coronavirus;narendraMon, 11 Jan 2021 20:10:00 GMTగత ఏడాది కాలంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఇక ఈ మహమ్మారిని రూపుమాపేందుకు వ్యాక్సిన్ కు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో మొదటగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైన్ నిర్వహించారు. ఇక ఇప్పుడు  కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు రంగం సిద్ధం అయింది. ఈ శుభ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో శుభవార్త అందించారు. తొలి దశలో భాగంగా ఇవ్వనున్న వ్యాక్సిన్‌ను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. జనవరి 16 నుంచి ప్రారంభం కానునున్న తొలి వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమంలో 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకయ్యే ఖర్చునంతా కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధాని మోదీ తెలిపారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు కరోనా వ్యాక్సిన్ అందిస్తామని మోదీ వెల్లడించారు. వీరిలో ప్రజా ప్రతినిధులు ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. ఇక రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 50 ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న (50 ఏళ్ల లోపు) వారికి టీకా ఇస్తామని తెలిపారు.




ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 2.5 కోట్ల మంది మాత్రమే టీకా తీసుకోగలిగారని ప్రధాని మోదీ అన్నారు. జులై నాటికి దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్లపై వదంతులు వ్యాపించకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. సైంటిస్టుల సలహాలు, నిపుణుల సూచనలు తీసుకున్న తర్వాతే టీకాలపై నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం (జనవరి 11) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వర్చువల్ ద్వారా జరిగిన ఈ భేటీలో వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు, సన్నద్ధతపై సీఎంలతో చర్చించారు. తొలి దశ టీకాల పంపిణీ తర్వాత ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ అవుతానని ప్రధాని చెప్పారు. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని అన్నారు.




అంజలి దేవి మనవరాలు కూడా స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది

పంచాయతీ ఎన్నికలపై కోర్టు సంచలన తీర్పు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>