PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda058e9030-bb19-4821-a68f-694baab55714-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda058e9030-bb19-4821-a68f-694baab55714-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు ఇపుడు చాలా చిత్ర విచిత్రంగా మారాయి. అధికారంలో ఉన్న పార్టీ వైసీపీకి ప్రత్యర్ధులు ఎవరు అంటే సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకే సమయంలో అనేక మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు అసలైన ప్రత్యర్ధి అనుకుంటే ఆయన కాదు మేము అని బీజేపీ వారు ముందుకు దూసుకువస్తున్నారు. nimmagadda;pawan;kumaar;kalyan;bharatiya janata party;jagan;andhra pradesh;panchayati;court;episode;ycp;june;march;partyమరో షాక్...నిమ్మగడ్డ ఇప్పట్లో రిటైర్ కారా.....?మరో షాక్...నిమ్మగడ్డ ఇప్పట్లో రిటైర్ కారా.....?nimmagadda;pawan;kumaar;kalyan;bharatiya janata party;jagan;andhra pradesh;panchayati;court;episode;ycp;june;march;partyMon, 11 Jan 2021 10:30:00 GMTఏపీ రాజకీయాలు ఇపుడు చాలా చిత్ర విచిత్రంగా మారాయి. అధికారంలో ఉన్న పార్టీ వైసీపీకి ప్రత్యర్ధులు ఎవరు అంటే సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకే సమయంలో అనేక మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు అసలైన ప్రత్యర్ధి అనుకుంటే ఆయన కాదు మేము అని బీజేపీ వారు ముందుకు దూసుకువస్తున్నారు.

మరో వైపు చూసుకుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత పర్యటనలు వరసగా చేసుకుంటూ జగన్ సర్కార్ కి సెగలు పుట్టిస్తున్నారు. ఇవన్నీ చాలవు అన్నట్లుగా ఎన్నికల సంఘంతో కూడా ప్రభుత్వం పేచీలకు దిగుతోంది. ఇక ఎన్నికల సంఘం స్వీయ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినది. దానికి ఉన్న విసృతమైన అధికారాలను ఎవరూ ప్రశ్నించజాలరు. అందువల్ల ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసింది.

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహించి మార్చి 31తో రిటైర్ అయిపోతారు అనుకుంటే అది వట్టి మాటేనని అంటున్నారు. ఆయన మరో మూడు నెలల పాటు తన పదవీ కాలాన్ని ఎక్స్ టెన్షన్ కోరేందుకు కోర్టు తలుపులు తట్టబోతున్నారు అన్న వార్త ఇపుడు పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.

దీనిలో సాధ్యాసాధ్యాలను కనుక గమనిస్తే అది జరిగినా జరగవచ్చు అన్న మాట కూడా ఉంది. నిమ్మగడ్డను గత ఏడాది ఏప్రిల్ తరువత కొన్నాళ్ళ పాటు పదవిలో లేకుడా వైసీపీ సర్కార్ చేసింది. ఆయన స్థానంలో కనగరాజు ని తెచ్చి కూర్చోబెట్టింది. ఆ మేరకు చట్ట సవరణలు చేసింది. అయితే అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎట్టకేలకు నిమ్మగడ్డకు పదవి అప్పగించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో నిమ్మగడ్డ తన విలువైన పదవీ కాలం మూడు నెలల పాటు కోల్పోయారని అంటున్నారు.

ఇపుడు ఆ పాయింట్ ని తీసుకుని ఆయన కోర్టుకు వెళ్ళి మరో మూడు నెలల పదవీ కాలాన్ని తనకు కల్పించి తన అయిదేళ్ల పదవీ కాలానికి న్యాయం చేయాలని కోరనున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అదే కనుక జరిగితే మాత్రం నిమ్మగడ్డ జూన్ వరకూ ఉంటారు. అపుడు మొత్తం మున్సిపల్ కార్పోరేషన్ల దాకా ఎన్నికలను నిర్వహించి మరీ ఆయన పదవీ విరమణ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ సర్కార్ పెద్దలకు భారీ షాకే మరి.




త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?

డబ్బే డబ్బు : క్రిడిట్ స్కోర్ లేకపోయినా ఇలా చేస్తే చాలు రుణాలు వస్తాయి !

భారత్ కోసం మరో దేశం సిద్ధమైంది.. చైనా కు ఊహించని షాక్..?

జగన్ కు షాక్... రాష్ట్రానికి మోహన్ భగవత్

పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>