MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/lasya-manjunath-youtube-channel2c97e3c9-4195-4d02-a707-c12d21aaf12e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/lasya-manjunath-youtube-channel2c97e3c9-4195-4d02-a707-c12d21aaf12e-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన యాంకర్ లాస్య మంజునాథ్. ఒకప్పుడు యాంకర్ రవితో "సమ్ థింగ్ సమ్ థింగ్" షోలో అలరించింది. ఆ తరువాత బుల్లితెరకు కొన్నాళ్ళు దూరమైంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో టచ్ లో ఉంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ వరకు పయనించి తన మునుపటి వైభవాన్ని దక్కించుకుంది. lasya manjunath youtube channel;view;lasya;bigboss;youtube;you tube;interview;houseలాస్య ఛానల్ హ్యాకయింది...లాస్య ఛానల్ హ్యాకయింది...lasya manjunath youtube channel;view;lasya;bigboss;youtube;you tube;interview;houseMon, 11 Jan 2021 09:00:00 GMTబిగ్ బాస్ తో యాంకర్ లాస్య మంజునాథ్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఒకప్పుడు యాంకర్ రవితో "సమ్ థింగ్ సమ్ థింగ్" షోలో అలరించింది. ఆ తరువాత బుల్లితెరకు కొన్నాళ్ళు దూరమైంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో టచ్ లో ఉంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ వరకు పయనించి తన మునుపటి వైభవాన్ని దక్కించుకుంది.

ఈ సమయంలో లాస్య తన ప్రాణానికి ప్రాణంగా అలాగే సెకండ్ బేబీతో సమానంగా చూసుకుంటున్న "లాస్య టాక్స్" అనే యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కి గురైంది. తన ఛానల్ హ్యాక్ కి గురైందన్న విషయాన్ని ఇంస్టాలో తనకు మెసేజెస్ ద్వారా తన ఫ్యాన్స్ తనకు తెలియచేశారని, తన ఛానల్ హ్యాక్ కు గురైందన్న విషయం వాస్తవమేనని తెలియచేసింది. ఎవరు ఈ పని చేసారో తెలియదని చెప్పుకొచ్చింది. తన టెక్నికల్ టీం ఈ ఇష్యూను సాల్వ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారని, త్వరలోనే ఈ ఛానల్ మళ్ళీ అభిమానుల ముందుకు వస్తుందని చెప్పుకొచ్చింది.

యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన తెలుగు బుల్లితెర మొదటి సెలబ్రిటీగా లాస్య పేరు పొందింది. లాస్యను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది యూట్యూబ్ లో తమ లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఈ విషయాన్ని నేరుగా లాస్యకు చెప్పడం కూడా జరిగింది. అంతెందుకు, రీసెంట్ గా హిమజను లాస్య కలిసింది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంటయిన హిమజకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి లాస్య ఇన్స్పిరేషన్ అట. ఈ విషయాన్ని హిమజ తెలియచేయగానే లాస్య పొంగిపోయింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే తన తోటి కంటెస్టెంట్స్ తో వీడియోస్ చేస్తూ బిజీగా ఉంది లాస్య. బిగ్ బాస్ క్రేజ్ లాస్య వీడియోస్ కు మిలియన్ల వ్యూస్ ను కూడా తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో తన ఛానల్ హ్యకయిన విషయం లాస్యకు షాకిచ్చిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఇంటర్వ్యూలో లాస్య తన యూట్యూబ్ ఛానల్ ను తన సెకండ్ బేబీగా చెప్పుకొస్తోంది. త్వరలోనే తన ఛానల్ మళ్ళీ తనకు లభిస్తుందని ఆశావాదాన్ని వ్యక్తం చేస్తోంది.  


తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>