SportsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab-played-very-well-in-match244772ca-e0b6-4b5d-b7c2-dbcee79d378b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab-played-very-well-in-match244772ca-e0b6-4b5d-b7c2-dbcee79d378b-415x250-IndiaHerald.jpg బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య సీడ్నీవేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్ 97 ప‌రుగులు సాధించాడు. తృటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు.panth;rohit;rohit sharma;india;australia;rishabh pant;118;paruguసిడ్నీ టెస్టులో విజ‌యం ముగింట భార‌త్‌.. పంత్ చెల‌రేగాడుగా..!సిడ్నీ టెస్టులో విజ‌యం ముగింట భార‌త్‌.. పంత్ చెల‌రేగాడుగా..!panth;rohit;rohit sharma;india;australia;rishabh pant;118;paruguMon, 11 Jan 2021 09:00:00 GMTఆస్ట్రేలియా, భారత్ మధ్య సీడ్నీవేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్ 97 ప‌రుగులు సాధించాడు. తృటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు. 118 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు సాధించ‌డం గ‌మ‌నార్హం.  పుజారా 58ప‌రుగులు సాధించాడు. 181 బంతుల్లో  తొమ్మిది ఫోర్ల‌తో   కలిసి నాలుగో వికెట్‌కు 148 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు. ఐదోరోజు భోజన విరామం తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లపై పంత్‌, పుజారా ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే లైయన్‌ వేసిన 80వ ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడబోయి గల్లీ పాయింట్‌లో కమిన్స్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 250 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనంతరం హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. భారత్‌ 80 ఓవర్లకు 250/4తో నిలిచింది. విజయానికి 157 పరుగులు అవసరమయ్యాయి.


అంత‌కు ముందు ఓవర్ నైట్ స్కోర్ 98/2తో ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ రహానే (4) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్ లో వైడ్ చేతికి దొరికిపోయాడు. భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.నాల్గవ రోజు రోహిత్, గిల్ ఇద్దరు ఔట్ అవ్వడంతో భారత్‎కు గట్టిగా ఎదురుదెబ్బగా మారింది. ఓవర్ నైట్ స్కోర్ 98/2 తో ఐదవ రోజు సోమవారం ఇన్నింగ్స్‎ను ప్రారంభించిన భారత్‎కు మొదట్లోనే షాక్ తగిలింది. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే (4) పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్..తనదైన శైలిలో ఆసీస్ బౌల్లర్లపై రెచ్చిపోయాడు.


ఆసీస్‎కు కలిసివచ్చిన పిచ్‎పై తొలి ఇన్నింగ్స్‎లో 338 పరుగులు చేయగా..భారత్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‎లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 312 రన్స్ చేసి టీమిండియా ముందు 407 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‎కు ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ జట్టుకు పునాది గట్టిగా వేశారు.భారత్ బ్యాటింగ్ సరళి చూస్తే డ్రా వైపై మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. అదే ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 6 వికెట్లను తీస్తే ఆసీస్ విజయం సొంతం చేసుకుంటుంది.


తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>