WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant4e2b5e3b-6151-47a6-9261-adfed071727b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant4e2b5e3b-6151-47a6-9261-adfed071727b-415x250-IndiaHerald.jpgస్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల జాగ్రత్తగా ఉండాలి. ఇక నేటి సమాజంలో గాలి ఎక్కువగా కలుషితమైంది. ఇక పట్టణ, నగర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమస్యలు, గర్భస్రావాలు, మృతశిశువుల జననాలు ఎక్కువగా ఉన్నాయి. లాన్సెట్ హెల్త్ జర్నల్ కొత్త అధ్యయనం ప్రకారం.. వాయు కాలుష్యం నేరుగా గర్భస్రావంకు సంబంధించినది.pregnant;health;rakshita;india;air;letter;pregnantఅమ్మ: గర్భిణుల బొడ్డుతాడును దెబ్బతీస్తున్న కాలుష్యం..!?అమ్మ: గర్భిణుల బొడ్డుతాడును దెబ్బతీస్తున్న కాలుష్యం..!?pregnant;health;rakshita;india;air;letter;pregnantMon, 11 Jan 2021 15:00:00 GMTగాలి ఎక్కువగా కలుషితమైంది. ఇక పట్టణ, నగర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమస్యలు, గర్భస్రావాలు, మృతశిశువుల జననాలు ఎక్కువగా ఉన్నాయి. లాన్సెట్ హెల్త్ జర్నల్ కొత్త అధ్యయనం ప్రకారం.. వాయు కాలుష్యం నేరుగా గర్భస్రావంకు సంబంధించినది. వాయు కాలుష్యాన్ని ఆపడం తక్షణావసరమని ఈ నివేదిక పేర్కొన్నది.

అయితే తల్లీబిడ్డలను కలిపే బొడ్డు తాడును దెబ్బతీయడం ద్వారా వాయు కాలుష్యం పిండాన్ని దెబ్బతీస్తున్నది. ఇక దక్షిణాసియాలో గర్భధారణపై కాలుష్యం యొక్క ప్రభావాన్ని చూపించే మొదటి అధ్యయనం ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా దక్షిణ ఆసియాలో గర్భాలు దెబ్బతింటున్నాయి. అయితే 2000-2016 మధ్య దక్షిణ ఆసియాలో కలుషితమైన గాలి 7.1 శాతం గర్భస్రావాలను కలిగించినట్లు పరిశోధకులు గుర్తించారు. భారతదేశంలో ప్రస్తుత గాలి నాణ్యత ప్రమాణం క్యూబిక్ మీటరుకు 40 మైక్రోగ్రాములుగా ఉన్నది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకం ప్రకారం, క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు సురక్షితంగా భావిస్తారు.

ఇక గర్భధారణ సమయంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. పుట్టబోయే బిడ్డపై కాలుష్యం విపరీతమైన ప్రభావం చూపుతుంది. తల్లి ఏది తిన్నా.. అది నేరుగా పిల్లలకు చేరుతుంది. కలుషితమైన గాలిని పీల్చడం పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రీ-మెచ్యూర్ డెలివరీ ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది. శిశువు పుట్టినప్పుడు బరువు తగ్గవచ్చు. అలాగే, పోషకాహార లోపానికి కారణమవుతుంది. పిల్లలలో అభివృద్ధి మందగిస్తుంది. గర్భంలో ఉన్న శిశువు సరైన ప్రాణవాయువు పొందక పుట్టకముందే ఆరోగ్య సమస్యలను పొందే అవకాశాలు ఉంటాయి. గర్భస్రావాలు జరిగేందుకు కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 




కోట్లు తీసుకుంటూ జ‌గ‌న్‌కు దెబ్బేస్తున్నారే... అయినా జ‌గ‌న్ వాళ్ల‌నే న‌మ్ముతున్నారా ?

ఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>