Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virushka97afc9e3-b9a4-4b12-ae39-42594ccadaf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virushka97afc9e3-b9a4-4b12-ae39-42594ccadaf5-415x250-IndiaHerald.jpgక్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. తనకు కూతురు పుట్టిందని, తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని..virushka;anoushka;anushka sharma;jeevitha rajaseskhar;prema;virat kohli;twitter;king;love;wife;king 1తండ్రైన విరాట్.. పాపకు జన్మనిచ్చిన అనుష్క... ట్విటర్‌లో ట్రెండింగ్తండ్రైన విరాట్.. పాపకు జన్మనిచ్చిన అనుష్క... ట్విటర్‌లో ట్రెండింగ్virushka;anoushka;anushka sharma;jeevitha rajaseskhar;prema;virat kohli;twitter;king;love;wife;king 1Mon, 11 Jan 2021 17:10:18 GMTవిరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. తనకు కూతురు పుట్టిందని, తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘‘మీ ప్రేమ, అభిమానం, ప్రార్థనలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈసారి మా గోప్యతను మీరు గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’’ అని ట్వీట్ చేశాడు. నిమిముషాల వ్యవధిలోనే 20 వేల లైక్ లు, 10వేలకు పైగా కామెంట్ లు వచ్చాయి.

విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు బిడ్డ పుట్టడంతో ప్రస్తుతం వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. విరాట్, అనుష్కలకు శుభాకాంక్షలు చెబుతూ లక్షల మంది పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ తండ్రయ్యాడని, విరాట్-అనుష్కలకు పెళ్లయి అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయని, ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రలయ్యారని, కాలం వేగంగా గడిచిపోతుందనడానికి ఇంతకు మించి ఉదాహరణ ఇంకేం ఉంటుందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కింగ్ కోహ్లీ తండ్రయ్యాడంటూ ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో విరుష్క, విరాట్ కోహ్లీ ట్యాగ్‌లను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అనుష్క బిడ్డకు జన్మనిస్తున్నందునే విరాట్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి కూడా తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి భార్య అనుష్కతోనే కోహ్లీ టైం స్పెండ్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నాడు. సిడ్నీ టెస్టులో ప్రేక్షకులు చేసిన జాతివివక్ష వ్యాఖ్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి సంఘటనలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ జరగకుండా చూడాలని తన ట్విటర్ ద్వారా పేర్కొన్నాడు.
" style="height: 360px;">





బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>