Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine0a8f2f2f-eba8-41da-be60-1e2e28445a22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine0a8f2f2f-eba8-41da-be60-1e2e28445a22-415x250-IndiaHerald.jpgభారతదేశంలో వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు చేపట్టాలని అటు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ వేదికగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన కార్యాచరణ సిద్ధమౌతుంది. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్ లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్vaccine;modi;india;narendra modi;prime minister;central government;narendraచైనా చెప్పింది.. భారతీయులు ఇప్పటికైనా నమ్ముతారో లేదో..?చైనా చెప్పింది.. భారతీయులు ఇప్పటికైనా నమ్ముతారో లేదో..?vaccine;modi;india;narendra modi;prime minister;central government;narendraMon, 11 Jan 2021 10:00:00 GMTకేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే  విధంగా చర్యలు చేపట్టాలని అటు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ వేదికగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన కార్యాచరణ సిద్ధమౌతుంది. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్  లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ రెండు రకాల వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.



 ఇకపోతే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కు అనుమతి ఇచ్చిన నాటి నుంచి అటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా  కి మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తవ్వలేదని.. అప్పుడే ఈ వ్యాక్సిన్ కి  అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చి ప్రజల ప్రాణాలను మోదీ సర్కార్ ప్రమాదంలో పడేస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో టీకా తీసుకున్న  వాలంటీర్ మృతి కూడా అందరిలో మరింత భయాందోళనలు కలిగిస్తోంది. ప్రతిపక్షాల విమర్శలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వెరసి..  రోజురోజుకు వ్యాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఎక్కువవుతున్నాయి.



 ఇలాంటి తరుణంలో ఇటీవల చైనా పరిశోధకులు చేసిన వ్యాఖ్యలు కాస్తా కీలకంగా మారిపోయాయి. భారత వ్యాక్సిన్లు మంచివే  అంటూ ఇటీవలే చైనా వ్యాఖ్యానించింది.  భారత్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ లకు  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల చైనా శాస్త్రవేత్తలు భారత వ్యాక్సిన్  గురించి నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. రీసెర్చ్ ప్రొడక్టివిటీ పరంగా చైనా తయారుచేసిన వ్యాక్సిన్ లకు టీకాలు  ఎక్కడ తీసిపోవు అంటూ చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు గ్లోబల్ మార్కెట్లో భారత్ కీలకం గా వ్యవహరిస్తుంది అంటూ చైనా శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే భారత వ్యాక్సిన్  అటు భారతీయులే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ  ఇక ఇప్పుడు శత్రు దేశమైన చైనా భారత వ్యాక్సిన్  గురించి అసలు నిజం చెప్పింది. మరి ఇప్పటికైనా నమ్ముతారో లేదో..


పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!

తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>