PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somu-veerraju-bjp-tirupati-loksabha-bypoll-janasen5bcffc66-ab7d-4901-9d1a-ea387aa87863-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somu-veerraju-bjp-tirupati-loksabha-bypoll-janasen5bcffc66-ab7d-4901-9d1a-ea387aa87863-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికల మీద అధికార విపక్షాలు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని విపక్షాలు కాస్త పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. ఇక అధికార పార్టీ అయితే ఈ ఎన్నికల మీద చాలా ఆశలు పెట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అధికార పార్టీ నేతలు కాస్త దూకుడుగా వెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో గనుక బిజెపి ప్రభావం చూపిస్తే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక సోము వీర్రాజుsomu;tiru;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;tirupati;cabinet;minister;husband;central government;ycp;ammavodi;dookudu;partyసోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందేసోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందేsomu;tiru;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;tirupati;cabinet;minister;husband;central government;ycp;ammavodi;dookudu;partyMon, 11 Jan 2021 17:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికల మీద అధికార విపక్షాలు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని విపక్షాలు కాస్త పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. ఇక అధికార పార్టీ అయితే ఈ ఎన్నికల మీద చాలా ఆశలు పెట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అధికార పార్టీ నేతలు కాస్త దూకుడుగా వెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో గనుక బిజెపి ప్రభావం చూపిస్తే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

ఇక సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా కాస్త సీరియస్ గా ఫోకస్ చేసారు. తాజాగా తిరుపతి తూర్పు మండల బిజేపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి అమ్మఒడి ఇస్తున్నారు అని ఆయన ఆరోపించారు. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి నేతలను తరిమితరిమి కొట్టండని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు నిలువునా దోచేస్తున్నారు అని సోము తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

అవినీతి, అక్రమాలు,దోచేయడం, దౌర్జన్యాలు చేయడం ఇదే వైసిపి నేతల దినచర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఎపి ప్రభుత్వం కట్టే ఇళ్ళన్నీ కేంద్రం ఇచ్చే నిధులే అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల్లో వైసిపి నేతలు కమిషన్ లు నొక్కేస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఇంటి పట్టాల కోసం భూసేకరణలో 3 వేల కోట్ల అనినీతి చోటు చేసుకుంది అని ఆయన అన్నారు. అభివృద్థి మాదే - ఓటు అడిగే హక్కు మాదే అని ఆయన స్పష్టం చేసారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసిపికి,టిడిపికి లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కేబినెట్ లో హోంమంత్రి కీలుబొమ్మ అన్నారు.


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?

నిమ్మ‌గ‌డ్డ కోవ‌ర్ట్... సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన జ‌గ‌న్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>