PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpgపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన సరే ఆయనకు మాత్రం రాజకీయంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాల్లో ఫోకస్ పెట్టడంతో ముఖ్యమంత్రి జగన్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో తెలుగుదేశం పార్టీ నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంtdp;kumaar;hyderabad;telugu desam party;jagan;andhra pradesh;telugu;court;chief minister;job;tdp;local language;punjab;partyసుప్రీం కోర్ట్ కి టీడీపీ... ఏం జరుగుతుంది...?సుప్రీం కోర్ట్ కి టీడీపీ... ఏం జరుగుతుంది...?tdp;kumaar;hyderabad;telugu desam party;jagan;andhra pradesh;telugu;court;chief minister;job;tdp;local language;punjab;partyMon, 11 Jan 2021 21:15:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన సరే ఆయనకు మాత్రం రాజకీయంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాల్లో ఫోకస్ పెట్టడంతో ముఖ్యమంత్రి జగన్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో తెలుగుదేశం పార్టీ నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందనే  ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

సుప్రీంకోర్టుకు వెళ్లి దీనిపై తెలుగుదేశం పార్టీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో హైకోర్టు గతంలో ఓసారి ఇప్పుడు ఒకసారి భిన్నమైన తీర్పునిచ్చింది అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా సహకరించే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అడ్డుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. అటు ఉద్యోగులు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

గతంలో హైకోర్టు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల కమీషన్ దే తుది నిర్ణయం అని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికల షెడ్యూల్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని గతంలోనే కొన్ని ఎన్నికల సంఘాలు వాదించిన పరిస్థితి చూసాం. మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అంశం లో ఇదే జరిగింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పంజాబ్ లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు.


సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>