PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh1b23526d-9024-4429-b980-973b77f6a362-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh1b23526d-9024-4429-b980-973b77f6a362-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. కిడ్నాప్ కి సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో ముగురు నిందితులను అరెస్ట్ చేశామన్న ఆయన వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఒకరు మల్లికార్జున్ రెడ్డి, మరొకరు బోయా సంపత్ కుమార్ (22) ఈయన భూమా అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్ అని, అలానే డ్రైవర్ బాలా చెన్నయ్య అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మూడandhra pradesh;kumaar;bala;mallikarjun;sampath;hyderabad;lodha;smart phone;police;january;bhuma akhila priya;driver;press;arrest;sampath kumar;reddyకిడ్నాప్ చేయించింది అఖిలప్రియే.. పూర్తి వివరాలు వెల్లడించిన సీపీ !కిడ్నాప్ చేయించింది అఖిలప్రియే.. పూర్తి వివరాలు వెల్లడించిన సీపీ !andhra pradesh;kumaar;bala;mallikarjun;sampath;hyderabad;lodha;smart phone;police;january;bhuma akhila priya;driver;press;arrest;sampath kumar;reddyMon, 11 Jan 2021 16:00:00 GMTబోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. కిడ్నాప్ కి సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో ముగురు నిందితులను అరెస్ట్ చేశామన్న ఆయన వారిని టాస్క్ ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఒకరు మల్లికార్జున్ రెడ్డి, మరొకరు బోయా సంపత్ కుమార్ (22) ఈయన భూమా అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్ అని, అలానే డ్రైవర్ బాలా చెన్నయ్య అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మూడు మొబైల్ ఫోన్స్ , ఫేక్ నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసున్నామన్న ఆయన మల్లికార్జున్ రెడ్డి ద్వారాభూమా అఖిల ప్రియ రెడ్డి 6 సిమ్ కార్డులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. 

ఏస్కె మొబైల్ షాపు నుండి 6 సిమ్ కార్డులు కొనుగోలు చేశారని, ఈ 6 సిమ్ కార్డులు కూడా మల్లికార్జున్,శ్రీను పేరు మీద తీసుకోవడం జరిగిందని వివరించారు. జనవరి 2వ తేదీన సిమ్ కార్డులు తీసుకున్నారని, వీటిలో ఒక సిమ్ కార్డు భూమా అఖిల ప్రియ ఉపయోగించిందని, మరికొన్ని సిమ్ కార్డు గుంటూరు శ్రీను ఉపయోగిండని పేర్కొన్నారు. కిడ్నాప్ కు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామన్న ఆయన 6 సిమ్ కార్డుల లొకేషన్స్, టవర్స్ లను  గుర్తించామని అన్నారు. భూమా అఖిల ప్రియ ఇల్లు కూకట్ పల్లి లోని లోదా అపార్ట్మెంట్ దిగా గుర్తించామన్న ఆయన అఖిల ప్రియ  ఆధ్వర్యంలో కిడ్నాప్ కు ముందే రెక్కీ నిర్వహించారని అన్నారు.

 కూకట్ పల్లి లోని ప్రదా గ్రాండ్ హోటల్ లో బస చేశారని, అఖిల ప్రియ కు సంబంధించి అన్ని ఆధారాలు దొరికాయని, జనవరి 5 న జరిగిన కిడ్నాప్ లో భూమా అఖిల ప్రియ ఫోన్ లో మాట్లాడిన సెల్ ఫోన్ ఆధారాలు సేకరించామని అన్నారు. లోధా అపార్ట్మెంట్ నుండి కిడ్నాప్ కు ప్లాన్ చేశారని, దానికి ఒక ఇనోవా, స్కార్పియో, ఒక టూ విల్లర్ ను ఉపయోగించారని పేర్కొన్నారు. అఖిలప్రియ సమక్షంలోనే ఈ ఆపరేషన్ మొత్తం జరిగిందన్న అయన భూమా అఖిల ప్రియ సొంత నెంబర్ ద్వారా కూడా కిడ్నాప్ విషయం చర్చించిందని అన్నారు. కిడ్నాపర్ నంబర్ నుండే కిడ్నాప్ అయిన వారి చేత డిసిపికి కాల్ చేయించి మేము సేఫ్ గా ఉన్నామని చెప్పించారని ఆయన వెల్లడించారు. 


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>