MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavan-maaraa-3d738499-fd80-4ffd-afd1-5f391a593d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavan-maaraa-3d738499-fd80-4ffd-afd1-5f391a593d2c-415x250-IndiaHerald.jpg"చెలి" సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన మాధవన్, నేటి తరం ఆడియెన్స్ ను కూడా ఎంటర్టైన్ చేయడంలో తన సత్తా చాటుకుంటున్నాడు. రీసెంట్ గా మాధవన్ "మారా" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎమెజాన్ ప్రైమ్ లో కొన్ని రోజుల క్రితం విడుదలైంది. madhavan "maaraa";madhavan;charlie;ram madhav;cinema;tamil;jersey;remake;hero;letter;heroine;shradda kapoor;romantic;research and analysis wingమాధవన్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడా...?మాధవన్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడా...?madhavan "maaraa";madhavan;charlie;ram madhav;cinema;tamil;jersey;remake;hero;letter;heroine;shradda kapoor;romantic;research and analysis wingMon, 11 Jan 2021 14:00:00 GMTమాధవన్, నేటి తరం ఆడియెన్స్ ను కూడా ఎంటర్టైన్ చేయడంలో తన సత్తా చాటుకుంటున్నాడు. రీసెంట్ గా మాధవన్ "మారా" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎమెజాన్ ప్రైమ్ లో కొన్ని రోజుల క్రితం విడుదలైంది.

ఇందులో "జెర్సీ" ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 2015లో మలయాళంలో విడుదలైన "చార్లీ" మూవీ తమిళ రీమేక్ ఇది. రీమేక్ చేసినా సరే ఒరిజినాలిటీని ఏ మాత్రం మిస్ చేయకుండా జాగ్రత్తపడ్డారు మేకర్స్. అనవసర కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించలేదు. మాధవన్ తన స్టైల్ చార్మ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడనే చెప్పుకోవాలి.

కానీ, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న మాధవన్ ఈ స్టోరీని ఎంచుకోవడం ఎంతవరకు సబబని కొంతమంది ఆడియెన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో ఆఖరి సీన్ వరకు హీరో హీరోయిన్స్ కలుసుకోరు. "చెలి" సినిమా వంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నవారిని ఈ సినిమా అప్సెట్ చేస్తుంది. ఇది ఒక ఆర్ట్ మూవీలా తెరకెక్కిందని చెప్పుకోవాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టలేదు.

స్టోరీకి అనుగుణంగా పాత్రలు బిహేవ్ చేస్తాయి. ఇమేజ్ బిల్డప్ కోసం సన్నివేశాలను డెవెలప్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. మరి, ఇటువంటి స్టోరీను ఎంచుకుని మాధవన్ రాంగ్ స్టెప్ వేశాడా అన్న సందేహాన్ని కొంతమంది ఆడియెన్స్ వ్యక్తపరుస్తున్నారు.

వయసుకు తగిన పాత్రలను ఎంచుకోవడంలో ముందుంటున్న మాధవన్ అందులో భాగంగానే ఇటువంటి వైవిధ్యభరితమైన పాత్రను ఎన్నుకున్నాడని ఇంకొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా "మారా" మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఫీల్ గుడ్ మూవీ ఇది.

శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాపై బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. నిజానికి, ఈ సినిమాలో "పారూ" పాత్రలో ఒదిగిపోయింది. మాధవన్ తో నటించడం తన అదృష్టమని సందర్భం దొరికినప్పుడల్లా ఈ ముద్దుగుమ్మ చెప్పుకొస్తోంది. ఈ సినిమాలో నిజానికి శ్రద్ధా శ్రీనాథ్ కి పెర్ఫామ్ చేసే అవకాశం బాగా దొరికింది. హీరో గోల్ ను సాధించడంలో హీరోయిన్ మెయిన్ రోల్ పోషిస్తుంది. తన స్టైల్ తో అలాగే నటనతో శ్రద్ధా బాగా ఆకట్టుకుంది. మాధవన్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడా...?


టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?

వామ్మో.. క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర వ‌ర‌ల్డ్ రికార్డు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>