Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas98e591bf-7d64-432d-9be3-e48e637a2437-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas98e591bf-7d64-432d-9be3-e48e637a2437-415x250-IndiaHerald.jpgడార్లింగ్ ప్రభాస్ రేంజ్ అంతకంతకు పెరిగిపోతూ వస్తోంది. చిన్న చిన్న సినిమాలకు సెలవు చెప్పేసి పాన్ ఇండియా సినిమాల్లోనే నటించే స్థాయికి ఎదిగిపోయాడు ఈ హీరో. 2021 లో ఈ హీరో సినిమాల జోరును పెంచాడు. కాగా ప్రస్తుతం ఈ హీరో ‘రాధేశ్యామ్’సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వీలైనంత తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర యూనిట్ తెగ కష్టపడిపోతోంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా అన్నిరంగాల పరిస్థితి దారుణంగా తయారయprabhas;prabhas;pooja hegde;annapurna;hyderabad;india;italy;cinema;telugu;tamil;hindi;hero;romantic;darlingవామ్మో..ప్రభాస్ కోసం ఇతర దేశాల నుంచి అంతమంది డ్యాన్సర్లను తెస్తున్నారా?వామ్మో..ప్రభాస్ కోసం ఇతర దేశాల నుంచి అంతమంది డ్యాన్సర్లను తెస్తున్నారా?prabhas;prabhas;pooja hegde;annapurna;hyderabad;india;italy;cinema;telugu;tamil;hindi;hero;romantic;darlingMon, 11 Jan 2021 15:00:00 GMTడార్లింగ్ ప్రభాస్ రేంజ్ అంతకంతకు పెరిగిపోతూ వస్తోంది. చిన్న చిన్న సినిమాలకు సెలవు చెప్పేసి పాన్ ఇండియా సినిమాల్లోనే నటించే స్థాయికి ఎదిగిపోయాడు ఈ హీరో. 2021 లో ఈ హీరో సినిమాల జోరును పెంచాడు. కాగా ప్రస్తుతం ఈ హీరో ‘రాధేశ్యామ్’సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వీలైనంత తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర యూనిట్ తెగ కష్టపడిపోతోంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా అన్నిరంగాల పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

ఇందులో సినీ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీని మూలంగా ఎన్నో సినిమాల షూటింగ్ లకు మొదటిలోనే బ్రేక్ పడగా.. మరొకొన్ని మధ్యలోనే షూటింగ్ ను ఆపవల్సి వచ్చింది. అయితే ఒక భారీ సినిమాను తీస్తున్నామంటే వివిధ దేశాల్లో షూటింగ్ ను జరపవల్సి వస్తుంది. కాని కరోనా వల్ల అది అసాధ్యమైపోయింది. అందుకే డైరెక్టర్లు ఇతర దేశాలకెళ్లే ప్రోగ్రాంలను మానుకుని ఇక్కడే సెట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో ‘పుష్ప’ షూటింగ్ సెట్ ను కూడా హైదరాబాద్ లో వేసారన్న వార్తలు విన్నాం. తాజాగా డార్లింగ్ ప్రభాస్‘రాధేశ్యామ్’ కోసం కూడా హైదరాబాద్ లోనే ఇటలీని రీ క్రియేట్ చేయబోతున్నారట. దీన్ని హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఏడు ఎకరాల్లో భారీ సెట్స్ ను ఏర్పాటు చేస్తోందట ఈ చిత్ర యూనిట్.

 ఈ సెట్ లో హీరో ప్రభాస్, పూజా ల మధ్యన ఓ రొమాంటిక్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ ఒక్క పాట కోసం 350 మంది ఇటలీ డ్యాన్సర్లను కూడా రప్పిస్తున్నారట. డ్యాన్సర్లు ఇక్కడకు వచ్చీ రాగానే వారికి కరోనా టెస్టులు చేయించారట. అయితే కరోనా మహమ్మారి మూలంగా ఇటలీ షెడ్యూల్ కుదరకపోవడంతో వాళ్లనే ఇక్కడకు రప్పించారు. దీంతో ఈ పాట హైదరాబద్ లో కాకుండా ఇటలీలోనే చిత్రీకరించినట్టు చూపించబోతున్నారు. ఇలా ఇతర దేశస్తులను ఇక్కడకు రప్పించి, ఇటలీ సెట్ వేసి చిత్రీకరించడం ఇదే తొలిసారట. ఈ సినిమా తెలుగుతో పాటుగా, తమిళం, హిందీ తో పాటుగా మరికొన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నామని ఆ చిత్రయూనిట్ తెలిపింది. కాగా ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


కోట్లు తీసుకుంటూ జ‌గ‌న్‌కు దెబ్బేస్తున్నారే... అయినా జ‌గ‌న్ వాళ్ల‌నే న‌మ్ముతున్నారా ?

ఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>