PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/first-covid-case-noted-in-micronesiab8281ad2-bbaf-48fe-8ccc-6170964ad775-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/first-covid-case-noted-in-micronesiab8281ad2-bbaf-48fe-8ccc-6170964ad775-415x250-IndiaHerald.jpgమైక్రోనేషియా అనేది ఓ చిన్న ద్వీపం.మైక్రోనేషియా దేశ జనాభా సుమారు లక్ష మంది. పసిఫిక్ మారుమూల దేశమైన మైక్రోనేషియాలో సోమవారం (జనవరి 10) తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఈ వార్త ఆ దేశ ప్రజలకు ఉలికిపాటుకు గురి చేసింది. అయితే.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ దేశ అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో స్పష్టం చేశారు. ఈ కరోనా కేసును దేశ సరిహద్దుల వద్దే కట్టడి చేశామని తెలిపారు. micronesia;hyderabad;january;2020;population;coronavirusలక్ష మంది జనాభా గల ఆ ద్వీప దేశాన్ని కూడా వదలని కరోనా....లక్ష మంది జనాభా గల ఆ ద్వీప దేశాన్ని కూడా వదలని కరోనా....micronesia;hyderabad;january;2020;population;coronavirusMon, 11 Jan 2021 17:40:00 GMT2020 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు గడిచిన గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఈ మాయదారి కరోనా వైరస్ మహమ్మారి కొత్త రూపం సంతరించుకొని కరోనా స్ట్రెయిన్ గా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో.... నేటికీ కొన్ని దేశాల్లో ఈ కరోనా వైరస్ మహమ్మారి జాడ లేకపోవడం నిజంగా విశేషం. ఆయా దేశాల నైసర్గిక స్వరూపం, ప్రత్యేక పరిస్థితులకు తోడు, కొవిడ్-19 మహమ్మారి తమ దేశంలో అడుగుపెట్టుకుండా వారు తీసుకుంటున్న జాగ్రత్తలే అందుకు గల కారణంగా తెలుస్తోంది. అయితే అలాంటి దేశాల్లో మైక్రోనేషియా ఒకటి. కానీ, ఇప్పుడు అది గతం అనే చెప్పాలి ఎందుకంటే... తాజాగా ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది.








పసిఫిక్ మారుమూల దేశమైన మైక్రోనేషియాలో సోమవారం (జనవరి 10) తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఈ వార్త ఆ దేశ ప్రజలకు ఉలికిపాటుకు గురి చేసింది. అయితే.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ దేశ అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో స్పష్టం చేశారు. ఈ కరోనా కేసును దేశ సరిహద్దుల వద్దే కట్టడి చేశామని తెలిపారు. ఫిలిప్పైన్స్‌లో మరమ్మతులో ఉన్న ఓ ప్రభుత్వ నౌకలోని సిబ్బందికి కరోనా సోకిందట. అందులో మైక్రోనేషియాకు చెందిన వ్యక్తి ఒకరున్నారు. అతడితో పాటు మిగిలిన ఉద్యోగులను ఆ నౌకలోనే నిర్బంధంలో ఉంచారట. అందువల్ల పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని మైక్రోనేషియా అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో తెలిపారు. పాఠశాలలు, చర్చిలు తెరిచే ఉంటాయని, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చునని భరోసా ఇచ్చారు.





మైక్రోనేషియా దేశ జనాభా సుమారు లక్ష మంది. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువేనన్నమాట. మైక్రోనేషియాతో పాటు పసిఫిక్ ద్వీప దేశాలు కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో చురుగ్గా వ్యవహరించాయి. ప్రపంచ దేశాల్లో వైరస్ తొలి కేసులు నమోదవుతున్న సమయంలోనే తమ సరిహద్దులను మూసివేశాయి. పర్యాటకంపై ఆధారపడిన ఆయా దేశాలు ఈ కారణంగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయినా.. వెనక్కి తగ్గలేదు. మైక్రోనేషియా అనేది ఓ చిన్న ద్వీపం. దీంతో పాటు వనౌటు, సాల్మన్, మార్షల్, సమోవా, ఇప్పటివరకు కరోనా చొరబడని ప్రాంతాలుగా ఉండేవి. కానీ, ఇప్పుడా గుర్తింపును కోల్పోయాయి. ఆయా దేశాల్లో ఒకట్రెండు కేసులు నమోదయ్యాయి. అది కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారి వల్లే. అయితే.. సమూహ వ్యాప్తి మాత్రం లేదు. కిరిబతి, నౌరు, పలావు, టోంగా, తువలు లాంటి దేశాల్లో ఇప్పటివరకు కరోనా వైరస్ అడుగుపెట్టకపోవడం విశేషం.




అమ్మ వడి పథకంలో ల్యాప్ ట్యాప్ ఆఫర్

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>