PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda3d20f7b9-3bed-4b4e-8b43-8325d4b45502-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda3d20f7b9-3bed-4b4e-8b43-8325d4b45502-415x250-IndiaHerald.jpgఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కూ.. సీఎం జగన్ కూడా డైరెక్ట్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. మార్చిలో పదవి నుంచి దిగిపోయే లోపల ఎలాగైనా ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ పట్టుదలగా ఉన్నారు. నిమ్మగడ్డ ఉన్నంతవరకూ ఎన్నికలు పెట్టేది లేదని జగన్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. అయితే జగన్ సర్కారుకు ఉద్యోగులు అండగా నిలిచారు. ఎన్నికలు బహిష్కరిస్తామంటున్నారు. ఈ మేరకు వాళ్లు మీడియా ముందు కూడా మాట్లాడారు.. తాజాగా ఇప్పుడు నిమ్మగడ్nimmagadda;prakruti;jagan;andhra pradesh;government;media;panchayati;press;war;chief commissioner of electionsనిమ్మగడ్డ ప్రెస్‌నోట్‌లో ఆ ఒక్క వాక్యం..? వామ్మో.. మామూలోడు కాదు..!?నిమ్మగడ్డ ప్రెస్‌నోట్‌లో ఆ ఒక్క వాక్యం..? వామ్మో.. మామూలోడు కాదు..!?nimmagadda;prakruti;jagan;andhra pradesh;government;media;panchayati;press;war;chief commissioner of electionsMon, 11 Jan 2021 07:00:00 GMTఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కూ.. సీఎం జగన్ కూడా డైరెక్ట్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. మార్చిలో పదవి నుంచి దిగిపోయే లోపల ఎలాగైనా ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ పట్టుదలగా ఉన్నారు. నిమ్మగడ్డ ఉన్నంతవరకూ ఎన్నికలు పెట్టేది లేదని జగన్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు.

అయితే జగన్ సర్కారుకు ఉద్యోగులు అండగా నిలిచారు. ఎన్నికలు బహిష్కరిస్తామంటున్నారు. ఈ మేరకు వాళ్లు మీడియా ముందు కూడా మాట్లాడారు.. తాజాగా ఇప్పుడు నిమ్మగడ్డ ఉద్యోగులకు బిస్కట్లు వేస్తూ.. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కష్టపడి పని చేసిన గుర్తింపు ఏపీ ఉద్యోగులకు ఉందని, ఇప్పుడు కూడా అదే  సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

పోలింగ్‌ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ అంటున్నారు. పోలింగ్‌ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. కరోనా టీకాలో పోలింగ్‌ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్‌షీల్డ్‌లు సరఫరా చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఆయన లేఖలో ఒక్క వాక్యం మాత్రం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఉద్యోగుల రక్షణ కోసం ఎన్నికల కమిషన్ మార్గదర్శకత్వంలో రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంటే ఈ గవర్నమెంట్ నేను చెప్పినట్టు నడవాల్సిందే సుమా.. వాళ్లకు వేరే ఆప్షన్‌ లేదని నిమ్మగడ్డ చెప్పకనే చెప్పారని నిపుణులు కామెంట్ చేస్తున్నారు. మరి ఆయన ఏ ధైర్యంతో అలా రాశారో తెలియదు కానీ.. మొత్తానికి నిమ్మగడ్డ ఇంకా తన వంతు పోరాటం మాత్రం చేస్తూనే ఉన్నారు. మరి యుద్ధం ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
   




రేవంత్ రెడ్డే బెస్ట్... డీసీ అధ్యక్షుల లేఖ

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>