MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sachin-joshi-case-issuee515730d-0662-43f6-8f22-9943bf081b5b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sachin-joshi-case-issuee515730d-0662-43f6-8f22-9943bf081b5b-415x250-IndiaHerald.jpgసినీ నటుడు, నిర్మాత, వ్యాపార‌వేత్త అయిన సచిన్‌ జోషి పై ఈమధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సచిన్ పై ఓ కేసు రిజిస్టర్ అయింది. అతని ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో సచిన్ జోషి పై ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం సంచలనంగా మారింది. sachin joshi case issue;sachiin joshi;sachin;joshiy;tiru;tollywood;cinema;police;media;producer;hindi;producer1;hero;traffic police;yuva;pune;chitramటాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!sachin joshi case issue;sachiin joshi;sachin;joshiy;tiru;tollywood;cinema;police;media;producer;hindi;producer1;hero;traffic police;yuva;pune;chitramMon, 11 Jan 2021 13:00:00 GMTసచిన్ జోషి ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. 'ఒరేయ్ పండు, నీ జతగా నేనుండాలి తదితర తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోగా నటించిన సచిన్ జోషి అందరికీ తెలిసే ఉంటారు. ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఒక రౌండ్ చుట్టేశాడు ఈ యువ హీరో. సినీ నటుడు, నిర్మాత, వ్యాపార‌వేత్త అయిన సచిన్‌ జోషి పై ఈమధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సచిన్ పై ఓ కేసు రిజిస్టర్ అయింది. అతని ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో సచిన్ జోషి పై ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం సంచలనంగా మారింది. అసలు విషయానికొస్తే..!!

గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో కెక్కారు సచిన్. తాము చేస్తున్న వ్యాపారంలో బకాయిలు సరిగా చెల్లించలేదని పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశాడు అతని స్నేహితుడు పరాగ్ సంఘ్వి. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారు సచిన్ జోషి, అతడి ఫ్రెండ్ పరాగ్ మరియు కొందరు వ్యాపార వేత్తలు. ఇది ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో వీరు ముందుగా నిర్ణయించుకున్న ఒప్పందం ప్రకారం... ఇంటర్నేషనల్ రిసార్ట్ కోరేగావ్ పార్కుకు రూ.58 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించాల్సి ఉండగా... సచిన్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాడు అని...2016 నుండి ఎటువంటి చెల్లింపులు చేయలేదని ఆరోపించారు.

అయితే దీనికోసం సంఘ్వి పుణె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ విషయంపై సచిన్ జోషి పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఈ అంశంపై పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాదు సచిన్ జోషి పై 30 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జోషి ఫ్రెండ్ ఫిర్యాదుతో చేపట్టిన దర్యాప్తులో కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.


ఎన్ని క్రీమ్స్ వాడిన ముఖంపై మచ్చలు తగ్గడం లేదా?

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?

వామ్మో.. క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర వ‌ర‌ల్డ్ రికార్డు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>