PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/akhila-priya-tdp9ed6de59-8f05-4e82-8061-0fbba71009b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/akhila-priya-tdp9ed6de59-8f05-4e82-8061-0fbba71009b9-415x250-IndiaHerald.jpgఏపీలో జ‌రిగితే తామే చేశామ‌ని టీడీపీ అంతులేని రాద్దాంతం చేసేద‌ని వాళ్లు ఫైర్ అయ్యారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు , ఆయ‌న త‌న‌యుడు లోకేష్ నుంచి.. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు వ‌ర‌కు ఎవ్వ‌రూ అఖిలకు స‌పోర్ట్ చేసిన పాపాన పోలేదు. అయితే ఎట్ట‌కేల‌కు అఖిల‌కు మ‌ద్ద‌తుగా తానున్నాడంటూ టీడీపీలో ఒకే ఒక్క‌డు ముందుకు వ‌చ్చాడు. ఆ నేత ఎవ‌రో కాదు.. జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి. ఇటీవ‌ల జేసీ ఫ్యామిలీ వ‌రుస కేసుల‌తో విల‌విల్లాడుతోన్న ప‌రిస్థితి. ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇప్ప‌టికే జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు.akhila priya tdp;kcr;kumaar;ram pothineni;andhra pradesh;telangana;bhuma akhila priya;minister;letter;tdp;ycp;lokesh kanagaraj;reddyపాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!akhila priya tdp;kcr;kumaar;ram pothineni;andhra pradesh;telangana;bhuma akhila priya;minister;letter;tdp;ycp;lokesh kanagaraj;reddyMon, 11 Jan 2021 10:03:35 GMTహైద‌రాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల‌ను కిడ్నాప్ చేసిన వ్య‌వ‌హారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిపోయారు మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌. ఆమె అరెస్టు అయ్యి జైలుకు వెళ్లినా.. ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ ప‌రారీలో ఉన్నా క‌నీసం టీడీపీ నేత‌లు ఆమెకు సానుభూతి కూడా ప్ర‌క‌టించేందుకు ముందుకు రావ‌డం లేదు. పైగా ఈ కేసు వ్య‌వ‌హారం అంతా తెలంగాణ‌లో న‌డ‌వ‌డంతో పాటు.. ఆమె ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మీప బంధువుల‌నే కిడ్నాప్ చేయ‌డంతో టీడీపీ వాళ్లు నోళ్ల‌కు తాళాలు వేసేసుకున్నారు.

దీనిపై ఏపీ వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఈ కేసు, ఈ అరెస్టులు ఏపీలో జ‌రిగితే తామే చేశామ‌ని టీడీపీ అంతులేని రాద్దాంతం చేసేద‌ని వాళ్లు ఫైర్ అయ్యారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు , ఆయ‌న త‌న‌యుడు లోకేష్ నుంచి.. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు వ‌ర‌కు ఎవ్వ‌రూ అఖిలకు స‌పోర్ట్ చేసిన పాపాన పోలేదు. అయితే ఎట్ట‌కేల‌కు అఖిల‌కు మ‌ద్ద‌తుగా తానున్నాడంటూ టీడీపీలో ఒకే ఒక్క‌డు ముందుకు వ‌చ్చాడు. ఆ నేత ఎవ‌రో కాదు.. జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి.

ఇటీవ‌ల జేసీ ఫ్యామిలీ వ‌రుస కేసుల‌తో విల‌విల్లాడుతోన్న ప‌రిస్థితి. ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇప్ప‌టికే జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు. జేసీ ఫ్యామిలీని వ‌రుస కేసులు కూడా వెంటాడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీపై కొద్ది రోజులుగా పోరాడుతోన్న ప‌వ‌న్‌కుమార్ ఆదివారం తాడిప‌త్రిలో త‌న స్వ‌గృహంలో విలేక‌ర్ల‌తో మాట్లాడారు. అఖిల‌ప్రియ అరెస్టుపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఓ మ‌హిళ అని చూడ‌కుండా అర్ధ‌రాత్రి అరెస్టులు ఏంట‌ని ప్ర‌శ్నించారు. అఖిల‌ప్రియ‌పై ఆళ్ల‌గ‌డ్డ‌లో కూడా ఏపీ ప్ర‌భుత్వం అనేక కేసులు పెట్టింద‌న్నారు.

ఏపీ ప్ర‌భుత్వం ప‌థ‌కం ప్ర‌కార‌మే టీడీపీ వాళ్ల‌ను అరెస్టులు చేయిస్తోందంటూ మండిప‌డ్డారు. ఉత్త‌రాంధ్ర‌లో అచ్చెన్నాయుడు.. కోస్తాలో కొల్లు ర‌వీంద్ర‌తో పాటు సీమ‌లో జేసీ ఫ్యామిలీ నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డంతో పాటు ఇప్పుడు అఖిల‌ను కూడా టార్గెట్ చేయించింద‌న్నారు. ఏదేమైనా టీడీపీలో అఖిల‌కు స‌పోర్ట్ చేసిన ఒకే ఒక్క‌డిగా ప‌వ‌న్ నిలిచారు. 


భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!

తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>