PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/akhila-priya-arrest87ce715c-d814-4bec-9051-d904ba480e58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/akhila-priya-arrest87ce715c-d814-4bec-9051-d904ba480e58-415x250-IndiaHerald.jpg"మేం పులి పిల్లలం.. పులుల్లాగే జీవిస్తాం కానీ, పిల్లుల్లా ఉండబోం.." అఖిల ప్రియ అరెస్ట్ వ్యవహారంపై ఆమె చెల్లెలు మౌనిక స్పందన ఇది. అఖిల ప్రియ అరెస్ట్ వెనక కుట్రకోణం ఉందని ఆరోపించిన మౌనిక.. తాము పులుల్లాగే బతుకుతామని, ఎవరికీ తలవంచబోమని తేల్చి చెప్పారు. భూమా నాగిరెడ్డి దంపతుల పిల్లలమని పులుల్లాగే ఉంటామని స్పష్టం చేశారు. akhila priya arrest;kcr;mounika;ram pothineni;telangana;g kishan reddy;police;bhuma akhila priya;minister;governor;tiger;arrest;girl;tdp;central government;lokesh kanagaraj;reddy;yevaru;party;bhuma nagi reddyమేం పులి పిల్లలం.. అఖిలప్రియ సోదరి మౌనిక పంచ్ డైలాగులు..మేం పులి పిల్లలం.. అఖిలప్రియ సోదరి మౌనిక పంచ్ డైలాగులు..akhila priya arrest;kcr;mounika;ram pothineni;telangana;g kishan reddy;police;bhuma akhila priya;minister;governor;tiger;arrest;girl;tdp;central government;lokesh kanagaraj;reddy;yevaru;party;bhuma nagi reddyMon, 11 Jan 2021 07:00:00 GMTపులి పిల్లలం.. పులుల్లాగే జీవిస్తాం కానీ, పిల్లుల్లా ఉండబోం.." అఖిల ప్రియ అరెస్ట్ వ్యవహారంపై ఆమె చెల్లెలు మౌనిక స్పందన ఇది. అఖిల ప్రియ అరెస్ట్ వెనక కుట్రకోణం ఉందని ఆరోపించిన మౌనిక.. తాము పులుల్లాగే బతుకుతామని, ఎవరికీ తలవంచబోమని తేల్చి చెప్పారు. భూమా నాగిరెడ్డి దంపతుల పిల్లలమని పులుల్లాగే ఉంటామని స్పష్టం చేశారు.

అక్క అఖిల ప్రియ అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర ఉందని, నీచ రాజకీయాలతో కుట్రపన్ని తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు అరెస్టు చేశారని మండిపడ్డారు మౌనిక. అఖిల అరెస్టు వెనుక భూ వివాదమే కాకుండా, ఇతర కారణాలూ ఉన్నాయని చెప్పారామె. ఆడపిల్ల అనే ఆలోచన లేకుండా అరెస్టు చేయడం వెనుక రాజకీయ తిమింగలాల ఒత్తిళ్లు ఉన్నాయని మండిపడ్డారు. పోలీసులు, జైలు అధికారులు అక్కకు సరైన వైద్యం, భోజనం కూడా అందనీయడం లేదని వివరించారు. ఆళ్లగడ్డలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడిన మౌనిక.. అఖిల అరెస్ట్ వెనక రాజకీయ దురుద్దేశాలున్నాయని చెప్పారు.

కిడ్నాప్ కేసులో ముందుగా ఏవీ సుబ్బారెడ్డిని ఏ-1 గా చేర్చారని, ఆ తర్వాత తన అక్క అఖిల ప్రియను ఏ-1 గా మార్చారని, దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు మౌనిక. తన భావ భార్గవ్ రామ్ ని కూడా కుట్రపూరితంగానే కేసులో ఇరికించారని చెప్పారు. అఖిలకు ఆరోగ్యం బాగోలేదని, ఆమెకు సరైన భోజనం పెట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్క కోసం గవర్నర్ ని కలసి వినతిపత్రం ఇస్తానని చెప్పారు.

అయితే టీడీపీ మాత్రం ఇప్పటి వరకూ అఖిల ప్రియ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. పార్టీ అధినేత చంద్రబాబు కానీ, లోకేష్ కానీ అఖిల అరెస్ట్ పై స్పందించలేదు. దీంతో భూమా కుటుంబ సభ్యులు కూడా ఎక్కడా చంద్రబాబు పేరు కానీ, టీడీపీ పేరు కానీ ప్రస్తావించడానికి ఇష్టపడటం లేదు. తొలుత మీడియాతో మాట్లాడిన మౌనిక.. తెలంగాణ సీఎం కేసీఆర్ ని అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు, తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసేందుకు నిర్ణయించుకున్నారు. కిషన్ రెడ్డి చొరవతో ఈ కేసులో రాజీకోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.




రేవంత్ రెడ్డే బెస్ట్... డీసీ అధ్యక్షుల లేఖ

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>