PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanthd07434b7-cb6a-4449-b4b6-8a6644b0cecf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanthd07434b7-cb6a-4449-b4b6-8a6644b0cecf-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరం నాడు కొత్త పార్టీ పేరును ప్రకటించి రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ అనిపించుకుంటారని అనుకునే సమయంలో రజినీ కాంత్ అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తానని గత ఏడాది డిసెంబర్‌లో తలైవా రజినీకాంత్‌ తెలియజేసిన సంగతి విధితమే. దీంతో తలైవా పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమని కాలర్ ఎగరేసుకుని మరీ ఆయన అభిమానులు తిరిగారు. కానీ.. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ ఒక్కసారిగా అందరికి షాకిచ్చారు. rajinikanth;hyderabad;apple;cinema;rajani kanth;letter;european union;custard apple;partyరజినీ కాంత్ సంచలన ప్రకటన.. ఈ బాషా ఒక్కసారి చెబితే..రజినీ కాంత్ సంచలన ప్రకటన.. ఈ బాషా ఒక్కసారి చెబితే..rajinikanth;hyderabad;apple;cinema;rajani kanth;letter;european union;custard apple;partyMon, 11 Jan 2021 19:06:00 GMTకొత్త సంవత్సరం నాడు కొత్త పార్టీ పేరును ప్రకటించి రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ అనిపించుకుంటారని అనుకునే సమయంలో రజినీ కాంత్ అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తానని గత ఏడాది డిసెంబర్‌లో తలైవా రజినీకాంత్‌ తెలియజేసిన సంగతి విధితమే. దీంతో తలైవా పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమని కాలర్ ఎగరేసుకుని మరీ ఆయన అభిమానులు తిరిగారు. కానీ.. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ ఒక్కసారిగా అందరికి షాకిచ్చారు. దీంతో ఆయన అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది. అనారోగ్యం కారణంగానే తాను రాజకీయాల్లోకి రావడం లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలోలో చేరారు.

ఇక్కడి నుంచే ఆయన తన రాజకీయ ప్రకటన గురించి చెప్పారు. ఆయన ఇంత స్పష్టంగా చెప్పినప్పటికి ఇప్పటికి రజినీ కాంత్‌ను రాజకీయాల్లోకి రమ్మంటూ అనేక మంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తలైవా రజినీకాంత్‌ తన రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకు మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని.. ఇది స్పష్టమైన నిర్ణయమని.. దయచేసి నను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆయన మరోమారు అందరిని కోరారు. తన నిర్ణయాన్ని ఇది వరకే వివరించానని చెప్పిన తలైవా దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రమ్మని ఇకపై ఆహ్వానించి ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

ఇందుకు సంబంధించి ఆయన  సోమవారం ఓ లేఖను కూడా విడుదల చేశారు‌. రజినీ కాంత్ అభిమానులు మాత్రం ఆయన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ అభిమాన నాయకుడు రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఎక్కడి కక్కడ నిరసనలు చేపడుతున్నారు. రజినీకాంత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఆయన చేసిన ప్రకటనను పరిశీలించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రజినీ కాంత్ స్పష్టంగా చెప్పినా ఆయన అభిమానులు నిరసనలు చేపడుతుండటంతో ఈ నిరసనల జ్వాల ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. 


మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది

ప్రజల మంచికోసమే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారట..?

దేశాన్ని కాపాడేందుకు భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ !

జగన్ కు బిగ్ షాక్..అక్రమాస్తుల కేసులో కోర్ట్ కీలక నిర్ణయం !!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>